Hyderabad City Police | చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నకిలీ నంబర్ ప్లేట్.. క్రిమినల్ కేసు నమోదు
Hyderabad City Police | ట్రాఫిక్ చలాన్ల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు.
Hyderabad City Police | త్రినేత్ర.న్యూస్ : ట్రాఫిక్ చలాన్ల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవీస్ ఒక ప్రకటనలో తెలిపారు.
మల్లేపల్లి పరిధిలోని గోకుల్‌నగర్‌కు చెందిన గైక్వాడ్ నవనాథ్(40) అనే వ్యక్తి తన హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌కు AP11AA6077 అనే నకిలీ నంబర్ ప్లేట్‌ను అమర్చాడు. ఈ నకిలీ నంబర్‌తో అతను అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. వాస్తవానికి ఆ నంబర్ రాజేంద్రనగర్ లక్ష్మిగూడకు చెందిన విక్కీ పాశ్వాన్ అనే వ్యక్తి యొక్క హోండా షైన్ వాహనానికి చెందింది. నిందితుడు చేసిన తప్పులకు గాను, అసలైన వాహన యజమాని విక్కీ పాశ్వాన్ పేరిట తప్పుడు చలానాలు జనరేట్ అయ్యాయని తెలిపారు.
ఈ క్రమంలోనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడు గైక్వాడ్ నవనాథ్‌ను అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిందితుడు వాడుతున్న వాహనం యొక్క అసలు నంబర్‌ను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
"వాహనాలకు నకిలీ, ట్యాంపరింగ్ చేసిన లేదా ఇతరుల నంబర్ ప్లేట్లను ఉపయోగించడం అనేది భారతీయ న్యాయ సంహిత (BNS), మోటార్ వాహనాల చట్టం ప్రకారం అత్యంత తీవ్రమైన, శిక్షార్హమైన నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అత్యాధునిక సీసీటీవీ సర్వైలెన్స్, ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాల సాంకేతికతను కలిగి ఉంది. వీటి ద్వారా నకిలీ నంబర్ ప్లేట్ వాహనాలను, వాటి కదలికలను సులభంగా గుర్తిస్తామని జాయింట్ కమిషనర్ జోయల్ డేవీస్ హెచ్చరించారు.
ప్రజలకు సూచన:
- పౌరులు ఎవరైనా తమ నంబర్ ప్లేట్ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానిస్తే.. వెంటనే క్రింది మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు కోరారు.
- వెబ్‌సైట్: https://echallan.tspolice.gov.in
- ఈమెయిల్ ఐడీ: echallanhelpdesk.hyd@gmail.com
- ట్రాఫిక్ ఈ-చలాన్ వాట్సాప్ నంబర్: 8712661690
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






