త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | రేప‌ట్నుంచి హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఈ మార్గాల్లో అస్స‌లు వెళ్ల‌కండి..!

Traffic Restrictions | హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాణిగంజ్ జంక్ష‌న్ వ‌ద్ద రైల్వే అండ‌ర్ బ్రిడ్జి పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల నేప‌థ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఎంజీ రోడ్డు, సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు.

S

Hyderabad | Published On Nov 19, 2026, 7.50 am IST

Traffic Restrictions | రేప‌ట్నుంచి హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఈ మార్గాల్లో అస్స‌లు వెళ్ల‌కండి..!
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాణిగంజ్ జంక్ష‌న్ వ‌ద్ద రైల్వే అండ‌ర్ బ్రిడ్జి పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల నేప‌థ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఎంజీ రోడ్డు, సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు.

సుమారు మూడు లేన్ల వెడల్పుతో, 1.5 మీటర్ల లోతు వరకు తవ్వకపు పనులు చేపట్టనున్నందున, బైక్‌లు, ఆటోలు, కార్ల రాకపోకలకు కేవలం ఒక లేన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది అని పోలీసులు తెలిపారు. రాణిగంజ్‌, ఎంజీ రోడ్డు, ట్యాంక్ బండ్, కర్బలా మైదాన్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందన్నారు.

హెవీ వెహిక‌ల్స్, గూడ్స్ వెహిక‌ల్స్, ట్రాన్స్‌పోర్టు వెహిక‌ల్స్, ట్రావెల్ బ‌స్సులు, ఆర్టీసీ బ‌స్సులకు అనుమ‌తి లేద‌న్నారు. ఈ వాహ‌నాల‌ను ప‌లు జంక్ష‌న్ల వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు.

ఎస్బీఐ ఎక్స్ రోడ్డు నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను ర‌సూల్‌పురా, బేగంపేట వైపు మ‌ళ్లించ‌నున్నారు. ప్యాట్నీ ఎక్స్ రోడ్స్, క్లాక్ ట‌వ‌ర్ వైపు నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను క్లాక్ ట‌వ‌ర్, ఎస్బీఐ ఎక్స్ రోడ్స్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. ప్యార‌డైజ్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను సీటీవో మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. పార్క్ లేన్ వైపు నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను ప్యాట్నీ ఎక్స్ రోడ్స్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.

మేడ్చ‌ల్ - బోయిన్‌ప‌ల్లి నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను ఎన్‌హెచ్ 44 మీదుగా సీటీవో జంక్ష‌న్, ర‌సూల్ పురా, మోన‌ప్ప‌, నిరంకారి, ల‌క్డీకాపూల్ లేదా ఎస్బీఐ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ, సంగీత్ ఎక్స్ రోడ్, రైల్ నిల‌యం మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

Advertisement
Advertisement