త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gas Cylinder | ప‌నిలోనుంచి తొల‌గించార‌ని.. య‌జ‌మాని బైక్‌, గ్యాస్‌ సిలిండ‌ర్, స్ట‌వ్‌ను ఎత్తుకెళ్లిన దంప‌తులు

Gas Cylinder | సెల‌వు ఇవ్వ‌లేద‌ని ఓ సెక్యూరిటీ గార్డు (Security Guard) తాను ప‌నిచేస్తున్న కంపెనీలో పైపులు ద‌హ‌నం చేశారు. మ‌రొక‌రు త‌మ‌ను ప‌నిలోనుంచి తొల‌గించాడ‌ని య‌జ‌మాని గ్యాస్ సిలిండ‌ర్ (Gas Cylinder)తోపాటు స్ట‌వ్‌ను ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న ఘ‌ట్‌కేస‌ర్‌లో చోటుచేసుకున్న‌ది.

G

Hyderabad | Published On Mar 29, 2026, 1.21 pm IST

Gas Cylinder | ప‌నిలోనుంచి తొల‌గించార‌ని.. య‌జ‌మాని బైక్‌, గ్యాస్‌ సిలిండ‌ర్, స్ట‌వ్‌ను ఎత్తుకెళ్లిన దంప‌తులు
Advertisement

Gas Cylinder | త్రినేత్ర‌.న్యూస్‌: సెల‌వు ఇవ్వ‌లేద‌ని ఓ సెక్యూరిటీ గార్డు (Security Guard) తాను ప‌నిచేస్తున్న కంపెనీలో పైపులు ద‌హ‌నం చేశారు. మ‌రొక‌రు త‌మ‌ను ప‌నిలోనుంచి తొల‌గించాడ‌ని య‌జ‌మాని గ్యాస్ సిలిండ‌ర్ (Gas Cylinder)తోపాటు స్ట‌వ్‌ను ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న ఘ‌ట్‌కేస‌ర్‌లో చోటుచేసుకున్న‌ది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన మల్లెల కిరణ్, ఆయన భార్య ఉపాధి నిమిత్తం ఘ‌ట్‌కేస‌ర్ (Ghatkesar) ప‌రిధిలోని అంకుషాపూర్ ఉంటున్నారు. గ‌త నెల రోజులుగా గ్రామానికి చెందిన పెరికాల ప్రవీణ్ ఫాంహౌస్‌లో మ‌ల్లెల కిర‌ణ్ దంపతులు ప‌నిచేస్తున్నారు. వారికి రూ.25 వేలు అడ్వాన్స్‌ ఇచ్చారు.

అయితే విధులు సక్రమంగా చేయడం లేదని విధులకు రావొద్దని వారికి సూచించారు. దీంతో యజమానిపై కోపంతో అతడి బైక్, స్టౌతో పాటు సిలిండర్‌ను ఈ నెల 16న ఎత్తుకెళ్లిపోయారు. ఫోన్‌ చేస్తే త్వరలో వస్తామని చెప్పినా.. వారం రోజులుగా స్పందించకపోవడంతో ప్రవీణ్ పోలీసుల‌కు ఫిర్యాదుచేశారు. ద‌ర్యాప్తులో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

గుంటూరులో రాయ‌పూడి స‌మీపంలో మేఘా ఇంజినీరింగ్ క్యాంపులో దొండ‌పాడుకు చెందిన రాము సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్నారు. రెండు రోజులు సెల‌వు అడ‌గినా ఇవ్వ‌లేద‌ని సూప‌ర్‌వైజ‌ర్‌పై అస‌హ‌నం, ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక నిప్పు పెట్టారు. ఏదైనా జ‌రిగితే అద‌నంగా సిబ్బందిని నియ‌మిస్తార‌నే ఉద్దేశంతో నిప్పు పెట్టార‌ని, కొంత కాలిన త‌ర్వాత ఆర్పేయాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన త‌ర్వాత స‌మాచారం ఇచ్చార‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement