Traffic jam | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం నుంంచి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు హైదరాబాద్, ఇటు సైబరాబాద్ పరిధిలోని ఫ్లై ఓవర్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ ద్వారా వాహనదారులు, ప్రయాణికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. శిల్పా ఫ్లై ఓవర్‌తో పాటు బొటానికల్ ఫ్లై ఓవర్‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తమ ఆఫీసులకు సకాలంలో చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కేబుల్ బ్రిడ్జిపై ఆగిపోయిన వాహనం సైబరాబాద్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జిపై ఓ వాహనంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ వాహనం నడి ఫ్లై ఓవర్‌పై ఆగిపోయింది. ఈ క్రమంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి కేబుల్ బ్రిడ్జిపైనే వాహనదారులు ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. https://x.com/i/status/2008773434445316357 🚦 TRAFFIC UPDATE – MADHAPUR 🚦 ⚠️ Slow Traffic Alert Traffic movement is slow at Opposite Cybergateway from NIA Road due to heavy vehicular flow. 🚔 Cyberabad Traffic Police are on the spot, monitoring the situation and regulating traffic to clear congestion. 🙏 Commuters are… pic.twitter.com/zcXIEwIEYK — Cyberabad Traffic Police (@CYBTRAFFIC) January 7, 2026