Gutka Manufacturing Unit | ఇంట్లో గుట్కా తయారీ కేంద్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు
Gutka Manufacturing Unit | హైదరాబాద్‌లో అక్రమ గుట్కా తయారీ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి ముగ్గురు నిందితులు, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
- గ్గురు నిందితులు సహా ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పరారీలో ఇంటి యజమాని, తయారీదారు
Gutka Manufacturing Unit | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లో అక్రమ గుట్కా తయారీ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి ముగ్గురు నిందితులు, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.50 లక్షల విలువైన నిషేధిత గుట్కా, యంత్రాలు, ప్యాకింగ్ మెటీరియల్‌ను జప్తు చేశారు.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫ్ఫర్ అలియాస్ దాదా, జుబేర్ ఇద్దరూ కలిసి మురాద్ నగర్‌లోని చోటీ మసీదు ఎదురుగా ఉన్న తమ భవనంలో చట్టవిరుద్ధంగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే నిషేధిత గుట్కా పదార్థాలను నగరంలో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేంద్రంలో మైనర్లను ప్రమాదకర వాతావరణంలో పనిలో కుదుర్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం, ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారంతో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఆసిఫ్ నగర్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి ఈ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఈ దాడిలో ఎలాంటి ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ (FSSAI), జి.ఎస్.టి (GST) లేదా పొగాకు లైసెన్సులు లేకుండా, ప్యాకెట్లపై కనీస తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్, ధర (MRP), ఆరోగ్య హెచ్చరికలు లేకుండా హానికరమైన AAA, బాద్ షా, సాగర్ పాన్ మసాలా, గుట్కా ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ అలియాస్ రోహిత్ యాదవ్ (25), రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాకు చెందిన సౌరభ్ అలియాస్ సౌరభ్ చౌహాన్ (20), మాతాదీన్ అలియాస్ రాహుల్ పర్మార్ (21) తో పాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. భవన యజమాని ముజఫ్ఫర్ అలియాస్ దాదా, తయారీదారు జుబేర్ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాం అని పోలీసులు తెలిపారు.
AAA పాన్ మసాలా ప్యాకెట్లు 100, AAA పాన్ మసాలా ప్యాకెట్లు 50 (ప్రతి ప్యాకెట్‌లో 70 సాచెట్లు), విడి జర్దా సంచులు
కాథా, సుపారీ, సున్నం ఉన్న ముడి సరుకుల సంచులు 14, తయారు చేసిన గుట్కా మిశ్రమం (విడి రూపంలో) 60 కేజీల సంచులు 24, 100 కేజీల సంచులు 2, ప్యాకింగ్ చేసిన సంచులు 11 సంచులు (ప్రతి సంచిలో 55 ప్యాకెట్లు, ప్రతి ప్యాకెట్‌లో 75 సాచెట్లు), సాగర్ 10 సాచెట్లు, గుట్కా ప్యాకింగ్ మిషన్లు (3), గుట్కా మిక్సింగ్ మిషన్ (1), గుట్కా ఓవెన్ మిషన్ (1), సుపారీ కటింగ్ మిషన్ (1) స్వాధీనం చేసుకున్నారు.
గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. మహేష్, ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ ఎన్. ఆనంద్, ఎస్సైలు కె. వెంకట్రామన్, ఎన్. నవీన్, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్
- ●K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్
- ●TG PRC | పీఆర్సీ అమలుపై నీలినీడలు
- ●B. Narsing Rao | తెలంగాణ దర్శకుడు బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్
- ●Asian Games | 44 ఏళ్ల నిరీక్షణకు తెర..! ఆసియా కప్ వుమెన్స్ హాకీలో భారత్కు స్వర్ణం
- ●BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు

Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్

K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్

TG PRC | పీఆర్సీ అమలుపై నీలినీడలు

B. Narsing Rao | తెలంగాణ దర్శకుడు బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్







