త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Illegal Egg Sale Racket Case | అండాల విక్ర‌యం కేసు.. స‌ద్గురు ఫౌండ‌ర్ డైరెక్ట‌ర్లు స‌హా న‌లుగురి అరెస్ట్‌.. ప‌రారీలో మ‌రో డైరెక్ట‌ర్‌

Hyderabad Illegal Egg Sale Racket Case | హైదరాబాద్‌ (Hyderabad)లో సంచలనం సృష్టించిన అక్రమ అండాల విక్రయం (Illegal Egg Sale Racket) కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

S

Telangana | Published On Nov 27, 2026, 12.59 pm IST

Hyderabad Illegal Egg Sale Racket Case | అండాల విక్ర‌యం కేసు.. స‌ద్గురు ఫౌండ‌ర్ డైరెక్ట‌ర్లు స‌హా న‌లుగురి అరెస్ట్‌.. ప‌రారీలో మ‌రో డైరెక్ట‌ర్‌
Advertisement
  • ఎన్నారై కిర‌ణ్ గేదెల కోసం గాలింపు.. నాన్ బెయిలబుల్ కోసం పోలీసుల యత్నం
  • సోదాలు వెలుగు చూస్తున్న సంచ‌ల‌న నిజాలు

Hyderabad Illegal Egg Sale Racket Case | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‌ (Hyderabad)లో సంచలనం సృష్టించిన అక్రమ అండాల విక్రయం (Illegal Egg Sale Racket) కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇందులో పాత్ర ఉన్న‌ స‌ద్గురు డైరెక్ట‌ర్లు హ‌రి ప్ర‌సాద్‌ (Hari Prasad), దుర్గా ప్ర‌సాద్‌ (Durga Prasad)తో స‌హా న‌లుగురిని పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. ఎన్నారైగా ఉన్న‌ మ‌రో డైరెక్ట‌ర్ కిర‌ణ్ గేదెల (Kiran Gedela) ప‌రారీలో ఉండ‌గా ఆయ‌న కోసం గాలిస్తున్నారు. ఆయ‌న లండ‌న్‌లో నివ‌సిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. నాన్ బెయిల‌బుల్ కేసు పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అండాల విక్రయంలో కిరణ్ గేదెల కీలక పాత్ర పోషించిన‌ట్లు భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (Sadguru Healthcare Services Pvt Ltd)లో సోదాలు కొన‌సాగుతుండ‌గా ఇంకెన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తాయోన‌నే ఉత్కంఠ నెల‌కొంది. ఈ సోదాల్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ (Oasis Fertility) నుంచి కోట్ల రూపాయలు సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్ర‌ధాన‌ సెంటర్లో మల్కాజిగిరి పోలీసులు సోదాలు చేప‌డుతున్నారు.

ఒక్కో అండానికి రూ.3 ల‌క్ష‌లు..

ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న పేద మహిళలు, యువ‌తుల‌ను పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల‌ నుంచి ఏజెంట్ల ద్వారా హైదరాబాద్‌కు రప్పించేవారు. వారిని ప్రత్యేక హాస్టళ్లలో ఉంచి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరించేవారు. ఇలా తీసుకున్న ఒక్కో అండాన్ని సంతానం లేని దంపతులకు రూ.3 లక్షల వరకు అమ్మిన‌ట్లు పోలీసుల‌ విచారణలో తేలింది. కొందరు వైద్యులకే పరిమితం కాకుండా, దాదాపు 11 రాష్ట్రాలకు విస్తరించిన ఒక వ్యవస్థీకృత కార్పొరేట్ నెట్‌వర్క్‌గా పోలీసులు గుర్తించారు. రికార్డుల్లో 66 మంది దాతల వివరాలు ఉండగా, అందులో 19 మందికి సంబంధించిన పత్రాలు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.

Advertisement
Advertisement