త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | మూడు కార్పొరేష‌న్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్..! కొత్త క‌మిష‌న‌ర్లను నియ‌మిస్తూ ఉత్తర్వులు జారీ

GHMC | గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు మూడు కార్పొరేష‌న్లుగా అవ‌త‌రించింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Hyderabad | Published On Feb 11, 2026, 8.59 am IST

GHMC | మూడు కార్పొరేష‌న్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్..! కొత్త క‌మిష‌న‌ర్లను నియ‌మిస్తూ ఉత్తర్వులు జారీ
Advertisement

GHMC | త్రినేత్ర‌.న్యూస్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు మూడు కార్పొరేష‌న్లుగా అవ‌త‌రించింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ( GHMC )తో పాటు సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(CMC), మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(MMC)ను ఏర్పాటు చేసింది. ఇక జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఆర్వీ క‌ర్ణ‌న్‌ను కొన‌సాగిస్తూ.. సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు శ్రీజ‌న‌, మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు విన‌య్ కృష్ణారెడ్డిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని 150 డివిజ‌న్లు డీలిమిటేష‌న్‌తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల సంస్థ‌ల ప‌రిధిలో 57 డివిజ‌న్లు ఏర్పాట‌య్యాయి. మొత్తం 300 డివిజ‌న్ల‌కు విస్త‌రించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిపాల‌న సౌల‌భ్యం, అధికార వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యాల‌తో మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జించింది. జీహెచ్ఎంసీ చ‌ట్టం-1995, సెక్ష‌న్‌-3(1) ప్ర‌కారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.

Advertisement
Advertisement