త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Mallareddy | సంక్రాంతి ముగ్గులతో మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి సంద‌డి.. వీడియో

MLA Mallareddy | మ‌ల్లారెడ్డి ఈ పేరు వింటేనే జ‌నాలకు ఎక్క‌డా లేని ఎన‌ర్జీ వ‌స్తుంది. ఎందుకంటే మ‌ల్లారెడ్డిలో ఆ స్థాయిలో ఎన‌ర్జీ ఉంటుంది మ‌రి. పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. అనే డైలాగ్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న మ‌ల్లారెడ్డి.. నిత్యం హుషారుగా క‌నిపిస్తూ ఉంటారు.

S

Hyderabad | Published On Jan 10, 2026, 12.31 pm IST

MLA Mallareddy | సంక్రాంతి ముగ్గులతో మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి సంద‌డి.. వీడియో
Advertisement

MLA Mallareddy | త్రినేత్ర‌.న్యూస్ : మ‌ల్లారెడ్డి ఈ పేరు వింటేనే జ‌నాలకు ఎక్క‌డా లేని ఎన‌ర్జీ వ‌స్తుంది. ఎందుకంటే మ‌ల్లారెడ్డిలో ఆ స్థాయిలో ఎన‌ర్జీ ఉంటుంది మ‌రి. పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. అనే డైలాగ్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న మ‌ల్లారెడ్డి.. నిత్యం హుషారుగా క‌నిపిస్తూ ఉంటారు. వేదిక ఏదైనా స‌రే త‌న మాట‌ల‌తో అక్క‌డున్న వారిలో జోష్ నింపుతారు.

తాజాగా సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి సంద‌డి చేశారు. పూడూరు - కిష్టాపూర్ డివిజ‌న్ కేఎల్ఆర్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేత ఆకిటి న‌వీన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌ల్లారెడ్డి మ‌హిళ‌ల‌తో క‌లిసి ముగ్గులు వేసేందుకు పోటీ ప‌డ్డారు. పోటీలో పాల్గొన్న మ‌హిళ‌ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ మ‌ల్లారెడ్డి స్వ‌యంగా ముగ్గు వేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

https://x.com/i/status/2009879709203739102

Advertisement

తాజావార్తలు

Advertisement