Army Weapons Theft | వీడిన మిస్టరీ.. బొల్లారంలో ఆయుధాలు ఎత్తుకెల్లింది ఆర్మీ మాజీ అధికారే!
Army Weapons Theft | బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో (Madras Regiment) ఆయుధాల చోరీ కేసును (Army Weapons Theft) పోలీసులు ఛేధించారు. గత పదిరోజులుగా సాగుతున్న కేసు విచారణం కొలక్కి వచ్చింది.
Army Weapons Theft | త్రినేత్ర.న్యూస్: బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో (Madras Regiment) ఆయుధాల చోరీ కేసును (Army Weapons Theft) పోలీసులు ఛేధించారు. గత పదిరోజులుగా సాగుతున్న కేసు విచారణం కొలక్కి వచ్చింది. రెజిమెంట్‌లో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారి (Army Officer) ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన తుపాకులను హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దాటినట్లు తేల్చారు. దీనికి మరో ముగ్గురు అధికారులు సహకరించినట్లు గుర్తించారు. దీంతో వారిని కూడా అరెస్టు చేశారు. అయితే అత్యంత పటిష్ట భద్రత గల మిలటరీ కంపౌండ్ నుంచి ఆయుధాలు ఏలా చోరీ చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
బొల్లారంలోని (Bollaram)మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు అపహరణకు గురైనట్లు గత నెలలో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు (Weapons Theft Case)నమోదైన విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా స్థానిక పోలీసులు, మిలిటరీ, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆయుధాల చోరీ మిస్టరీని ఛేదించారు. చోరీకి పాల్పడిన మాజీ అధికారి నివాసంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రహస్యంగా దాచి ఉంచిన భారీ ఆయుధ నిల్వలు బయటపడ్డాయి. 12 ఏకే-47 (AK-47) తుపాకులు, అత్యాధునిక ఇన్‌సాస్ (INSAS) గన్స్ సహా దాదాపు 1,200 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Fire Accident | స్కూల్లో అగ్నిప్రమాదం.. 24 మంది చిన్నారులు మృతి
- ●BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ
- ●Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
- ●Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!
- ●Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
- ●NHRC | కాంగ్రెస్ సర్కార్‌పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Fire Accident | స్కూల్లో అగ్నిప్రమాదం.. 24 మంది చిన్నారులు మృతి

BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ

Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!




