Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్
Madras Regiment | సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో రిటైర్డ్ హవల్దార్ ఉప్పుతోళ్ల మహేశ్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30 రిటైర్డ్ అయితే.. ఆగస్టు 30న రాత్రి చోరీ ఎలా జరిగిందేనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి.
Madras Regiment | త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో రిటైర్డ్ హవల్దార్ ఉప్పుతోళ్ల మహేశ్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30 రిటైర్డ్ అయితే.. ఆగస్టు 30న రాత్రి చోరీ ఎలా జరిగిందేనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాథమిక విచారణలో వెల్లడైన విషయాలతో పాటు ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాలను డీజీపీ వెల్లడించారు.
రిటైర్డ్ అయ్యాక ఎలా అనుమతించారు..?
ఈ ఏడాది జూన్ 30న ఉప్పుతోళ్ల మహేశ్.. అనారోగ్య సమస్యలు, ఇన్‌డిసిప్లేన్ చర్యల వల్ల పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత తనను సర్వీసు నుంచి ముందే పదవీ విరమణ చేయించారనే కోపంతో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆగస్టు 28, 29 తేదీల్లో అది కూడా రాత్రి సమయాల్లో మద్రాస్ రెజిమెంట్‌కు చేరుకున్నాడు. అక్కడ విధుల్లో ఉండే సెక్యూరిటీకి తాను మద్రాస్ రెజిమెంట్ అని చెప్పి లోపలికి వెళ్లేవాడు.. సెక్యూరిటీ కూడా అనుమతించారని డీజీపీ తెలిపారు.
సీసీటీవీ పని చేయదని ముందే తెలుసు
ఇక 28, 29 తేదీల్లో మద్రాస్ రెజిమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు. రాత్రి వేళ ఎక్కడెక్కడ లైటింగ్ ఉంటుందని చూసుకున్నాడు. కోట్, ఆమ్యునేషన్ గదుల ఏరియాలో రాత్రి సమయాల్లో సీసీటీవీ పని చేయదని అతనికి ముందే తెలుసు. ఇక వెహికల్ మూవ్‌మెంట్, లైటింగ్ వ్యవస్థను స్టడీ చేసి నిర్ధారించుకున్నాడు.
30న రాత్రి 11 గంటలకు యాక్టివాపై బయల్దేరి
ఆగస్టు 30న రాత్రి 11 గంటలకు బాలాజీ నగర్‌లోని తన ఇంటి నుంచి యాక్టివాపై కార్గిల్ గేటు ద్వారా మద్రాస్ రెజిమెంట్‌లోని కోట్ వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత తాళం పగులగొట్టి.. ఆయుధాలను తీసుకువచ్చి డార్క్ ఏరియాలో పెట్టాడు. అనంతరం ఆమ్యునేషన్ ఉన్న కోట్ వద్దకు వెళ్లి తాళం పగులగొట్టేందుకు గంట సేపు యత్నించాడు. తాళం పగులగొట్టిన తర్వాత ఆయుధాలకు అవసరమైన ఆమ్యునేషన్‌ను మాత్రమే తీసుకున్నాడు. దాదాపు గంట పాటు కోట్ వద్దనే గడిపాడు.
2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ వద్దకు చేరుకుని
యాక్టివాపై ఆయుధాలను, ఆమ్యునేషన్‌ను పెట్టుకుని.. మద్రాస్ రెజిమెంట్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ వద్దకు చేరుకున్నాడు. అయితే మ్యాగ్జిన్స్ పెట్టే కవర్స్ కోసం మళ్లీ వెళ్లాడు. టెంపుల్ వద్దనే డార్క్ ఏరియాలో ఆయుధాలను పెట్టి వెళ్లాడు. ఈసారి సెక్యూరిటీ అతన్ని ప్రశ్నించగా, మద్రాస్ రెజిమెంట్ అనేసరికి వదిలేశారు.
తెల్లవారుజామున 4.34 గంటలకు ఇంటికి.. ఆ తర్వాత అచ్చంపేటకు
ఆమ్యునేషన్ మ్యాగ్జిన్ కవర్స్ తీసుకుని, వాటన్నింటిని బ్యాగులో పెట్టేసి బాలాజీ నగర్‌లోని ఇంటికి తెల్లవారుజామున 4.34 గంటలకు రీచ్ అయ్యాడు. ఆయుధాలను బ్రీజా వైట్ కారులో లోడ్ చేసుకుని అచ్చంపేట వైపు వెళ్లాడు. ఓఆర్ఆర్ బొంగులూరు గేటు మీదుగా శ్రీశైలం రోడ్‌ను అవయిడ్ చేసి.. నలుగురిని ప్యాసింజర్‌ను ఎక్కించుకుని దేవరకొండ వద్ద వదిలేశాడు.. ఎవిడెన్స్ కోసం పైసలు తీసుకున్నాడు. మళ్లీ డిండి వద్ద ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు. ప్రేమెంట్ తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు.
సొంతింటికి చేరుకుని.. గుంత తీసి
31న అచ్చంపేట మండలంలోని తన సొంతూరు జంగారెడ్డిపల్లికి చేరుకున్నాడు. గడ్డివాము వద్ద గుంత తీసి అందులో ఆయుధాలు పాతిపెట్టాడు. మళ్లీ గడ్డి కప్పేశాడు. ఇంట్లో ఉన్న తండ్రికి ఈ విషయం గురించి చెప్పలేదు.
ఐదారు రోజులకు మిత్రుని ఇంటికి షిఫ్ట్
ఏం అనుమానం వచ్చిందో తెలియదు కానీ.. ఐదారు రోజుల తర్వాత సెప్టెంబర్ 6న పదర పీఎస్ పరిధిలోని మిత్రుని ఇంటి వద్దకు ఆయుధాలను షిఫ్ట్ చేశాడు.
మళ్లీ రెండు రోజులకు సొంతింటికి షిఫ్ట్
రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు 8న సొంతింటి వద్ద మళ్లీ పాతి పెట్టాడు. ఇది ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వలేకపోయాడు అని డీజీపీ తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం
- ●Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ - కయదు మిస్సింగ్
- ●AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!
- ●Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- ●Madras Regiment | ఆ కక్షతోనే ఆర్మీ ఆయుధాలు దొంగిలింత
- ●Balmuri Venkat | 75 శాతం కానిస్టేబుల్ పోస్టులు ఆదివాసీలకు కేటాయించాలి: బల్మూరి వెంకట్

TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం

Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ - కయదు మిస్సింగ్

AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!

Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం




