Cyclone Arnab | ఏపీ తీరంవైపుగా ‘అర్నబ్’ తుపాను.. యానాం సమీపంలో తీరం దాటే ఛాన్స్..
Cyclone Arnab | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. ఈ నెల 28న ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మంగళవారం తెలిపింది.
Cyclone Arnab | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. ఈ నెల 28న ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మంగళవారం తెలిపింది. ఐఎండీ వివరాల ప్రకారం.. తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అంతకుముందు ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదిలింది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 360 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.
మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయవ్య దిశగా కదిలిన తుపాను.. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గాలుల వేగం అప్పుడప్పుడు 140 కిలోమీటర్లకు చేరవచ్చని తెలిపింది.
తుపాను ప్రభావం ఇప్పటికే మొదలైందని ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో త్వరలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలతోపాటు బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది. తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటికే గాలుల తీవ్రత పెరిగినట్లు వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని, తుపాను ప్రభావం నుంచి రక్షణ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Osmania University | ఓయూలో తొలిసారిగా ఫాస్మి ద్వైవార్షిక సదస్సు
- ●HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్ సాగర్ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొలగింపు
- ●Serial Actress | ట్రెండీ లుక్‌లో జగద్ధాత్రి సీరియల్ హీరోయిన్
- ●Burns to Shine 2026 | కాలిన గాయాల బాధితులకు ఉచిత సర్జరీలు.. నిహారి సేవలకు కేటీఆర్ ఫిదా!
- ●Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి

CM Revanth Reddy | గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Osmania University | ఓయూలో తొలిసారిగా ఫాస్మి ద్వైవార్షిక సదస్సు

HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్ సాగర్ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొలగింపు

Serial Actress | ట్రెండీ లుక్‌లో జగద్ధాత్రి సీరియల్ హీరోయిన్



