Osmania University | ఓయూలో తొలిసారిగా ఫాస్మి ద్వైవార్షిక సదస్సు
Osmania University | ఆసియాలో మాలిక్యులర్ ఇమేజింగ్ రంగంలో పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధికి వేదికగా నిలిచే ఫాస్మి (FASMI) ద్వైవార్షిక సదస్సు–2026కు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆతిథ్యమిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ సొసైటీస్ ఫర్ మాలిక్యులర్ ఇమేజింగ్ (FASMI), మాలిక్యులర్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా (MISI) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు భారత్‌లో తొలిసారిగా జరుగుతోంది.
Osmania University | ఆసియాలో మాలిక్యులర్ ఇమేజింగ్ రంగంలో పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధికి వేదికగా నిలిచే ఫాస్మి (FASMI) ద్వైవార్షిక సదస్సు–2026కు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆతిథ్యమిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ సొసైటీస్ ఫర్ మాలిక్యులర్ ఇమేజింగ్ (FASMI), మాలిక్యులర్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా (MISI) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు భారత్‌లో తొలిసారిగా జరుగుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ సమావేశానికి దేశ, విదేశాలకు చెందిన సుమారు 350 మంది శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధకులు, పరిశ్రమల నిపుణులు హాజరయ్యారు.
ఓయూకే గర్వకారణమన్న వీసీ
సదస్సును ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహణ ఓయూకు గర్వకారణమన్నారు. గతంలో తైవాన్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో ఈ సమావేశాలు జరిగాయని గుర్తుచేశారు. వైద్యరంగంలో రోగ నిర్ధారణ, చికిత్సలో కచ్చితత్వం ప్రాణాలను కాపాడటంలో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల నియంత్రణకు అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. వైద్య సదుపాయాల్లో అంతరాలను తగ్గించడంతోపాటు పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు.
వ్యక్తిగత వైద్య సేవలకు మాలిక్యులర్ ఇమేజింగ్
డ్యూక్–ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ ఆన్–మేరీ చాకో మాట్లాడుతూ.. చికిత్సకు రోగులు ఎలా స్పందిస్తున్నారో అంచనా వేయడంలో మాలిక్యులర్ ఇమేజింగ్ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. యువ పరిశోధకులు అంతర్జాతీయ సహకారంతో పరిశోధనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సదస్సులో భాగంగా మాలిక్యులర్ ఇమేజింగ్, కృత్రిమ మేధ (ఏఐ) అంశాలపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ కీలకోపన్యాసం చేశారు. ఈసాటే ఇండియా ఎన్‌ఎస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పోర్టబుల్ అల్ట్రాసౌండ్ సాంకేతికతపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. ఎంఆర్‌ఐ, థెరానోస్టిక్స్, అల్ట్రాసౌండ్, మల్టీమోడల్ ఇమేజింగ్, వైద్యరంగంలో ఏఐ వినియోగం వంటి అంశాలపై శాస్త్రీయ సమావేశాలు నిర్వహించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్ సాగర్ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొలగింపు
అక్టోబర్ 27, 2026

Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి
అక్టోబర్ 27, 2026

Vande Bharat Sleeper | మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్ సాగర్ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొలగింపు
- ●Serial Actress | ట్రెండీ లుక్‌లో జగద్ధాత్రి సీరియల్ హీరోయిన్
- ●Burns to Shine 2026 | కాలిన గాయాల బాధితులకు ఉచిత సర్జరీలు.. నిహారి సేవలకు కేటీఆర్ ఫిదా!
- ●Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి
- ●Ritika Nayak | పవర్‌పేట నుంచి పడమట వీధి జానకి వచ్చేసింది - మిరాయ్ హీరోయిన్‌తో సందీప్‌కిషన్ రొమాన్స్
- ●Telangana Drought Mandals List 2026 | తెలంగాణలో 365 కరువు మండలాలు: 31 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. ఇదిగో లిస్ట్

HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్ సాగర్ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొలగింపు

Serial Actress | ట్రెండీ లుక్‌లో జగద్ధాత్రి సీరియల్ హీరోయిన్

Burns to Shine 2026 | కాలిన గాయాల బాధితులకు ఉచిత సర్జరీలు.. నిహారి సేవలకు కేటీఆర్ ఫిదా!

Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి



