త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam | కండక్టర్‌ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం

Minister Ponnam | విధి నిర్వహణలో గాయపడిన ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ భ‌రోసా ఇచ్చారు. ఖమ్మం రీజియన్‌ పరిధిలోని మణుగూరు డిపోలో పనిచేస్తున్న ప్రవళికను దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని ఆస్పత్రిలో మంత్రి పరామర్శించారు.

P

Telangana | Published On Oct 27, 2026, 10.45 pm IST

Minister Ponnam | కండక్టర్‌ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం
Advertisement

Minister Ponnam | విధి నిర్వహణలో గాయపడిన ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ భ‌రోసా ఇచ్చారు. ఖమ్మం రీజియన్‌ పరిధిలోని మణుగూరు డిపోలో పనిచేస్తున్న ప్రవళికను దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని ఆస్పత్రిలో మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రవళిక ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో ప్రయాణికులు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఉద్యోగులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప దాడులకు పాల్పడటం సమర్థనీయం కాద‌న్నారు.

దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

ఖమ్మంలో కండక్టర్‌ ప్రవళికపై జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పొన్నం ప్ర‌భాక‌ర్‌ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ర‌వాణాశాఖ మంత్రి హెచ్చరించారు. ఉద్యోగుల భద్రత విషయంలో రాజీ పడబోమని, ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఖమ్మం రీజియన్‌ పరిధిలోని మణుగూరు డిపోకు చెందిన కండక్టర్‌ ప్రవళిక ఇటీవల విధి నిర్వహణలో ఉండగా ఓ ప్రయాణిరాలు ఆమెను తోసివేయడంతో గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో ఆమెకు వైద్య చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయి సంజీవని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని తెలిపారు.

 

Advertisement
Advertisement