Army Weapons Theft | బొల్లారం ఆయుధాల చోరీ వ్యవహారం.. పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి!
Army Weapons Theft | అత్యంత భద్రత నడుమ ఉండే బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో (Madras Regiment) ఆయుధాలు మాయమైన (Army Weapons Theft) కలకలం సృష్టిస్తున్నది. గత 10 రోజులుగా ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు, ఆర్మీ అధికారులు, ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా దర్యాప్తుచేస్తున్నారు.
Army Weapons Theft | త్రినేత్ర.న్యూస్: అత్యంత భద్రత నడుమ ఉండే బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో (Madras Regiment) ఆయుధాలు మాయమైన (Army Weapons Theft) కలకలం సృష్టిస్తున్నది. గత 10 రోజులుగా ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు, ఆర్మీ అధికారులు, ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా దర్యాప్తుచేస్తున్నారు. ఈక్రమంలో ఓ ఆర్మీ అధికారిని లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆయుధాల చోరీ మిస్టరీకి ఒకట్రెండు రోజుల్లో తెరపడే అవకాశాలున్నట్లు సమాచారం.
ఆగస్టు 30న సాయంత్రం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 7 గంటల మధ్య బొల్లారంలోని (BOLLARAM) మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిటీర్కార్ ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్‌తో పాటు 1,912 బుల్లెట్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీకి చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ (MI), స్పెషల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (SIA), ఎన్ఐఏ అధికారులు, మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మద్రాస్ రెజిమెంట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, పరిసర కాలనీల్లోని వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు ఒక మ్యాగజైన్ మాత్రమే లభించింది.

దీంతో బయటి వ్యక్తులు ఇంత పకడ్బందీగా సైనిక కేంద్రంలోకి చొరబడి ఆయుధాల గది తాళాలు తీసి ఎత్తుకెళ్లడం అసాధ్యమని నిర్ధారణకు వచ్చిన అధికారులు, అంతర్గత కుట్ర కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయుధాలు భద్రపరిచే కోట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది, అక్కడికి ప్రవేశించే అధికారం ఉన్నవారిని గుర్తించి మొత్తం 42 మందితో జాబితా సిద్ధం చేశారు. ఒక్కొక్కరినీ విచారించి, చోరీతో సంబంధం లేని వారిని దర్యాప్తు నుంచి మినహాయించారు. ఈ క్రమంలో ఓ ఆర్మీ అధికారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో.. అతడిని ఈ నెల 3 నుంచి పోలీసులు, ఎన్ఐఏ, ఆర్మీ అధికారులు విడతల వారీగా ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఫోన్ కాల్ డేటా, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలను నిపుణులు పరిశీలిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి
- ●Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..
- ●RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
- ●Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!
- ●KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..
- ●Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు

Road Accident | లారీలో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, 200 మేకలు మృతి

Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్

Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!



