త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Power Grid Office | ఇదేం బుద్ధిరా నాయ‌నా.. మ‌హిళ‌ల వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌తో అలా

Power Grid Office | క‌వాడిగూడలోని ప‌వ‌ర్ గ్రిడ్ కార్యాల‌యం( Power Grid Office ) వాష్‌రూమ్‌లో ర‌హ‌స్యంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్( Mobile Phone ) క‌ల‌క‌లం సృష్టించింది. ఈ పాడు ప‌నికి పాల్పడిన అటెండ‌ర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు

S

Hyderabad | Published On Oct 24, 2026, 4.03 pm IST

Power Grid Office | ఇదేం బుద్ధిరా నాయ‌నా.. మ‌హిళ‌ల వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌తో అలా
Advertisement

Power Grid Office | త్రినేత్ర న్యూస్ : క‌వాడిగూడలోని ప‌వ‌ర్ గ్రిడ్ కార్యాల‌యం( Power Grid Office ) వాష్‌రూమ్‌లో ర‌హ‌స్యంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్( Mobile Phone ) క‌ల‌క‌లం సృష్టించింది. ఈ పాడు ప‌నికి పాల్పడిన అటెండ‌ర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

క‌వాడిగూడ‌లోని ప‌వ‌ర్ గ్రిడ్ కార్యాల‌యంలో మ‌హిళ‌ల వాష్‌రూమ్ అది. అయితే వాష్‌రూమ్‌లోని వాష్ బేసిన్ కింద డ‌బుల్ సైడెడ్ టేప్‌తో ఫోన్‌ను అతికించారు. ర‌హ‌స్యంగా ఏర్పాటు చేసిన ఈ మొబైల్‌ను ఓ మ‌హిళా ఉద్యోగి అక్టోబ‌ర్ 13న గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆందోళ‌న‌కు గురైన బాధిత ఉద్యోగిని.. ఫోన్ గురించి అక్క‌డున్న సిబ్బందికి చెప్పారు.

దీంతో ఫ్లోర్ అటెండెంట్‌ భ‌ర‌త్‌.. ఆ ఫోన్‌ను లాక్కొని ప‌రుగెత్తాడు. అప్ర‌మ‌త్త‌మైన స‌హోద్యోగులు, భ‌ద్రతా సిబ్బంది క‌లిసి భ‌ర‌త్‌ను ప‌ట్టుకున్నారు. ఇక దొరికిపోయాన‌ని భావించిన అటెండెంట్‌.. ఫోన్‌ను నేల‌కేసి కొట్టాడు. ఈ ఘ‌ట‌న‌పై అక్టోబ‌ర్ 19న గాంధీన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. భ‌ర‌త్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లోతైన ద‌ర్యాప్తు కోసం కేసును సిటీ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు బ‌దిలీ చేశారు.

Advertisement
Advertisement