Keerthy Suresh | బాలీవుడ్ వెబ్‌సిరీస్ కోసం కీర్తి సురేష్ రికార్డ్ రెమ్యూనరేషన్ – గన్ షూటింగ్‌లోట్రైనింగ్
క్రైమ్ డ్రామా వెబ్‌సిరీస్ అక్క కోసం కీర్తి సురేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సిరీస్ కోసం ఈ తమిళ బ్యూటీ ఆరు కోట్ల పారితోషికం స్వీకరించినట్లు చెబుతోన్నారు. కీర్తి సురేష్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ అని టాక్ వినిపిస్తోంది. రాధికా ఆప్టే మరో కీలక పాత్రలో నటిస్తోన్న అక్క వెబ్‌సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Oct 24, 2026, 3.20 pm IST
Keerthy Suresh | సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుముఖం పడుతుంటాయి. పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ప్రయోగాల జోలికి పోకుండా గ్లామర్‌కు దూరంగా పద్దతితో కూడిన క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటారు. కానీ మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కెరీర్ ఇందుకు భిన్నంగా సాగుతోంది. ప్రియుడు ఆంథోనీ తాటిల్‌తో వివాహం తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ మళ్లీ జోరును పెంచింది. తెలుగు, తమిళం, బాలీవుడ్ (Bollywood) అనే భేదాలు లేకుండా ప్రతి భాషలో బిజీగా ఉంది.
ఐదు సినిమాలు...
ప్రస్తుతం మహానటి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు హిందీలో అక్క పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో రాధికా ఆప్టే మరో కీలక పాత్ర పోషించింది. ధన్‌రాజ్ శెట్టి దర్శకత్వం వహించారు.
గ్యాంగ్‌స్టర్...
అక్క వెబ్‌సిరీస్‌లో భవానీ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్ ఈ కోలీవుడ్ బ్యూటీ కనిపించడం ఇదే మొదటిసారి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌లో కీర్తి సురేష్ లుక్, ఆమె డైలాగ్ డెలివరీ, ఆమెపై వచ్చిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
గన్ షూటింగ్...
భవానీ పాత్రకు న్యాయం చేయడం కోసం చాలానే కష్టపడాల్సివచ్చిందంటూ ఇటీవల ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ చెప్పింది. యాక్షన్ సన్నివేశాల్లో పర్‌ఫెక్షన్ కోసం గన్ షూటింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు చెప్పింది. డైలాగ్ డెలివరీపై విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో హిందీ యాసను పర్‌ఫెక్ట్‌గా పలకడంలో శిక్షణ తీసుకొని ఈ సిరీస్‌కు డబ్బింగ్ చెప్పినట్లు కీర్తి సురేష్ పేర్కొన్నది.
కెరీర్‌లో హయ్యెస్ట్...
కాగా అక్క వెబ్‌సిరీస్ కోసం కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ కోసం ఈ తమిళ బ్యూటీ ఆరు కోట్ల పారితోషికం స్వీకరించినట్లు చెబుతోన్నారు. కీర్తి సురేష్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ అని సమాచారం. ప్రస్తుతం సినిమాల కోసం మూడు నుంచి ఐదు కోట్ల మధ్య రెమ్యూనరేషన్ అందుకుంటోంది. సినిమాలకు మించి వెబ్‌సిరీస్ కోసం రికార్డ్ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఆసక్తికరంగా మారింది. అక్క కోసం రాధికా ఆప్టే నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
తెలుగులో...
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో జనవరి 12 విడుదల, రౌడీ జనార్ధనతో పాటు తమిళంలో సత్యవన్ సావిత్రి సినిమాలు చేస్తోంది. ఇందులో రాఫ్తార్ పేరుతో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని అంగీకరించింది. ఇవే కాకుండా మరో రెండు ఒప్పుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Deverakonda | బాధ్యతతో చేసిన సినిమా – డబ్బులు, అవార్డులు ఇవ్వని తృప్తి ఇచ్చింది – “రణబాలి”పై విజయ్ దేవరకొండ కామెంట్స్
అక్టోబర్ 24, 2026

Kayadu Lohar | కయదు లోహర్ రొమాంటిక్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – ప్రేమించిన అమ్మాయి రక్తపిశాచి అని తెలిస్తే!
అక్టోబర్ 23, 2026

Nagadurga | మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు – “ఇడుపుకాయితం” సినిమాపై నాగదుర్గ కామెంట్స్
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Candle Making Business | ఇంట్లోనే క్యాండిల్స్ తయారీ.. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయానికి అవకాశం..
- ●Talasani Srinivas Yadav | పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోండి
- ●ED Raids | హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
- ●Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు మృతి
- ●Vijay Deverakonda | బాధ్యతతో చేసిన సినిమా - డబ్బులు, అవార్డులు ఇవ్వని తృప్తి ఇచ్చింది - "రణబాలి"పై విజయ్ దేవరకొండ కామెంట్స్
- ●Debt Repayment | అప్పులు తీర్చాలా? పెట్టుబడులు పెట్టాలా? ఏది ముందు చేయాలి..?

Candle Making Business | ఇంట్లోనే క్యాండిల్స్ తయారీ.. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయానికి అవకాశం..

Talasani Srinivas Yadav | పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోండి

ED Raids | హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు మృతి



