త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోండి

Talasani Srinivas Yadav | ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ( Graduates ) ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవాల‌ని మాజీ మంత్రి, స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్( Talasani Srinivas Yadav ) పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కోసం హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు.

S

Telangana | Published On Oct 24, 2026, 2.58 pm IST

Talasani Srinivas Yadav | ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోండి
Advertisement

హైద‌రాబాద్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 23 వేల మంది ద‌ర‌ఖాస్తు
మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వెల్ల‌డి

Talasani Srinivas Yadav | త్రినేత్ర న్యూస్ : ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ( Graduates ) ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవాల‌ని మాజీ మంత్రి, స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్( Talasani Srinivas Yadav ) పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కోసం హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ చాలా తప్పుల త‌డ‌క‌గా ఉంది. గత ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎందుకని చాలా మంది అడుగుతున్నారు? లేనిపోని ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు తీసుకురావడం దురదృష్టకరం. రేపట్నుంచి ఓటర్ల నమోదు కార్య‌క్ర‌మాన్ని ఉధృతంగా తీసుకోవాలని నిర్ణయించాం. ఆది, సోమ‌వారాల్లో నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామ‌న్నారు.

సోమవారం సీఈవోను కలిసి ఉన్న ఇబ్బందులను వివరిస్తాం. సీఎం, ప్రభుత్వం సరిగ్గా ఉంటే ఇంత తక్కువగా ఎందుకు ఓటర్ల నమోదు ఎందుకు జరుగుతుంది? చేతగాని ప్రభుత్వం, పని చేయడం రాదు... అందుకే కరెంట్, నీటి సమస్య త‌లెత్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం సలహాలు అయినా తీసుకోవాలి కదా. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. దరిద్రమైన పాలన వచ్చిన తర్వాతే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని త‌ల‌సాని పేర్కొన్నారు.

కరెంట్, మంచినీరు ఉండదు అని ఇప్పుడు చెప్తున్నారు.. ఆర్నెళ్లుగా మేము చెప్తున్నా పట్టించుకోలేదు. భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేరన్న అంశాన్ని గుర్తించాలి. కేసీఆర్ హయాంలో కరెంట్, తాగునీరు, సాగునీరు ఎలా వచ్చిందో ప్రజలు అందరికీ తెలుసు. రైతులు, ప్రజల ఇబ్బందులు గాలికి వదిలేసి బూతు పురాణం అందుకుంటున్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి క్షుద్రపూజలు అని మాట్లాడతారా? బీఆర్ఎస్ అంటే భయం లేకపోతే ప్రతిసారి మా ప్రస్తావన ఎందుకు వస్తోంది. ఇలాగే కాలయాపన చేయండి.. రెండేళ్ల తర్వాత ప్రజలు ఇంటికి పంపుతారు అని త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు. ప్రభుత్వం ఇకనైనా అందరిని సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Advertisement
Advertisement