Mobile Public Address Systems | ప్రియమైన ప్రజలారా! నీటిని పొదుపుగా వాడండి.. కాలనీల్లో మొబైల్ మైక్‌లతో ప్రచారం షురూ
Mobile Public Address Systems | ఎల్‌నినో (El Nino) ప్రభావ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు నీటి వినియోగంపై కాలనీల్లో ప్రచారం షురువైంది.
Flash news | Published On Oct 24, 2026, 3.42 pm IST
Mobile Public Address Systems | త్రినేత్ర న్యూస్: ఎల్‌నినో (El Nino) ప్రభావ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు నీటి వినియోగంపై కాలనీల్లో ప్రచారం షురువైంది. ప్రియమైన ప్రజలారా.. డిసెంబర్ 15 నుంచి నీటి కష్టాలు మొదలవుతాయని.. పొదుపుగా వాడి అందరి బాగు కోసం సహకరించాలని కోరుతూ మణికొండలోని పంచవతి కాలనీ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం ప్రారంభించారు. మొబైల్ మైక్‌ల (Mobile Public Address Systems)తో కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు.
ప్రియమైన నివాసితులకు విజ్ఞప్తి. సింగూరు, మంజీరా జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. డిసెంబర్ 15 తర్వాత నీటి సరఫరా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో భూ గర్భ జలమట్టాలు కూడా పడిపోతున్నాయి.
సెల్లార్లు, రోడ్లు, కార్లు, మీ దాబాలు కడగడానికి నల్లా నీరు, బోర్ వాటర్‌ను వృథా చేయొద్దు. ఒకవేళ నీటిని వృథా చేస్తే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ (HMWSSB) దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బోర్‌వెల్ మోటర్లు, భారీ నిర్మాణాలను స్వాధీనం చేసుకునే వీలుంది. ప్రతి నీటి చుక్కను పొదుపు చేయండి. అందరి బాగు కోసం నీటిని పొదుపుగా వాడుతూ సహకరించండి అంటూ ప్రచారం కల్పిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Khulsumpura Traffic Police Special Drive | సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్‌లో దొరికిపోయారు.. ఎన్ని కేసులయ్యాయంటే!
అక్టోబర్ 24, 2026

Uttam Kumar Reddy | ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ కరువు దెబ్బ తగ్గేది
అక్టోబర్ 24, 2026

BRS MLAs | కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలి
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ● Khulsumpura Traffic Police Special Drive | సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్‌లో దొరికిపోయారు.. ఎన్ని కేసులయ్యాయంటే!
- ●OPPO Pad Mini | మ్యాట్ డిస్ప్లేతో కొత్త ట్యాబ్.. లాంచ్ చేసిన ఒప్పో.. భారీ బ్యాటరీ..
- ●Uttam Kumar Reddy | ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ కరువు దెబ్బ తగ్గేది
- ●iPhone Duo | 11వేల సార్లు మడిచిన తరువాత ఐఫోన్ డ్యుయో పరిస్థితి ఇది.. మన్నిక ఎలా ఉంది..?
- ●BRS MLAs | కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలి
- ●Kajal Aggarwal | రామాయణ మూవీ నుంచి కాజల్ సీన్లు కట్ - అందుకే ప్రమోషన్లకు దూరమా?

Khulsumpura Traffic Police Special Drive | సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్‌లో దొరికిపోయారు.. ఎన్ని కేసులయ్యాయంటే!

OPPO Pad Mini | మ్యాట్ డిస్ప్లేతో కొత్త ట్యాబ్.. లాంచ్ చేసిన ఒప్పో.. భారీ బ్యాటరీ..

Uttam Kumar Reddy | ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ కరువు దెబ్బ తగ్గేది

iPhone Duo | 11వేల సార్లు మడిచిన తరువాత ఐఫోన్ డ్యుయో పరిస్థితి ఇది.. మన్నిక ఎలా ఉంది..?



