త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | నేను కూడా అడ్వ‌కేట్ కావాల్సి ఉండే.. కానీ

Mahesh Kumar Goud | నేను కూడా అడ్వ‌కేట్ కావాల్సి ఉండే.. కానీ ఎల్ఎల్‌బీ చ‌ద‌వ‌డం మిస్ అయింద‌ని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అడ్వ‌కేట్ వృత్తి నుంచి వ‌చ్చిన వారు రాజ‌కీయాల్లో చాలా మంది రాణించార‌ని తెలిపారు.

S

Telangana | Published On Oct 24, 2026, 3.25 pm IST

Mahesh Kumar Goud | నేను కూడా అడ్వ‌కేట్ కావాల్సి ఉండే.. కానీ
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్ : నేను కూడా అడ్వ‌కేట్ కావాల్సి ఉండే.. కానీ ఎల్ఎల్‌బీ చ‌ద‌వ‌డం మిస్ అయింద‌ని టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అడ్వ‌కేట్ వృత్తి నుంచి వ‌చ్చిన వారు రాజ‌కీయాల్లో చాలా మంది రాణించార‌ని తెలిపారు. ఇందిరా భవన్‌లో టీ పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన టీసీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. ఈ సమావేశంలో టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అడ్వకేట్ ప్రొఫెషన్ గౌరవం, కఠినంతో కూడుకున్నది. రాజ్యాంగబద్ద సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. దేశంలో కొన్ని జడ్జిమెంట్స్ చూసి ఆశ్చర్యపోతున్నాం. ఎలక్షన్ కమిషన్‌ను జేబు సంస్థగా వాడుకుంటున్నారు. సీబీఐ, ఈడీ ఇష్టానుసారం వాడుతున్నారు అని మండిప‌డ్డారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం. నవంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో అడ్వకేట్ సమస్యలపై చర్చించుకుందాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం అమ‌లు చేస్తున్నాం. 80 వేలకు పైగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు ఇచ్చాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ‌ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించండి అని మ‌హేశ్ కుమార్ గౌడ్ కోరారు.

Advertisement
Advertisement