త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | అమీర్‌పేట‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు

Fire Accident | హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో (Ameerpet) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జ‌రిగింది. అమీర్‌పేటలోని మైత్రివనం (Mythrivanam) చౌర‌స్తాలో ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ బిల్డింగ్‌లో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి.

G

Hyderabad | Published On Feb 20, 2026, 12.06 pm IST

Fire Accident | అమీర్‌పేట‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు
Advertisement

Fire Accident | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో (Ameerpet) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జ‌రిగింది. అమీర్‌పేటలోని మైత్రివనం (Mythrivanam) చౌర‌స్తాలో ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ బిల్డింగ్‌లో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. క్ర‌మంగా మంట‌లు విస్త‌రించ‌డంతో భారీగా అగ్నికీల‌లు ఎగిసిపడుతున్నాయి. దీంతో ప్రాంతంలో ద‌ట్టంగా పొగ క‌మ్ముకున్న‌ది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.

కాగా, బిల్డింగ్‌లోని నాలుగు అంత‌స్తులో ఉన్న‌ ఓ కోచింగ్ సెంట‌ర్‌లో (Coaching Center) ప‌లువురు విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిని ర‌క్షించేందుకు రెస్య్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మంటల్లో చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తున్న‌ది. అయితే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement