Tollywood | తెలుగు సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ చెల్లెలు – హారర్ కామెడీ సీక్వెల్‌లో ఛాన్స్!
టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న జాంబీ రెడ్డి 2లో జాన్వీ కపూర్ చెల్లెలు షనయా కపూర్ హీరోయిన్‌గా నటించబోతుంది.
Entertainment | Published On Jun 29, 2026, 2.49 pm IST
Tollywood | బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌పై మనసు పడుతున్నారు. తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అలియాభట్, దీపికా పడుకోణ్, త్రిప్తి డిమ్రితో పాటు పలువురు బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో హిందీ హీరోయిన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హనుమాన్ హీరో తేజా సజ్జాతో జాన్వీ చెల్లెలు జోడీకట్టబోతుంది.
జాంబీరెడ్డి 2...
తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన జాంబీరెడ్డి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. జాంబీరెడ్డి 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్ ఇటీవలే సెట్స్‌పైకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ను జరుపుతోన్నారు.
జాన్వీ సోదరి...
హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న జాంబీరెడ్డి 2లో బాలీవుడ్ సుందరి షనయా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తేజా సజ్జా మూవీతోనే షనయ టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేయబోతుంది. బోనీకపూర్ తమ్ముడు, బాలీవుడ్ నిర్మాత సంజయ్ కపూర్ కూతురు అయిన షనయా గత ఏడాది రిలీజైన బాలీవుడ్ మూవీ ఆంఖో కీ గుస్తాకియాన్ తో హీరోయిన్‌గా ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది. ఈ సినిమా కంటే ముందు జాన్వీకపూర్ గుంజన్ సక్సేనా సినిమాకు షయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. వరుసకు జాన్వీ కపూర్‌కు షనయా సోదరి అవుతుంది.
పాన్ ఇండియన్ మూవీ...
మిరాయ్‌తో హీరోగా దక్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు తేజా సజ్జా. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జాంబీ రెడ్డి 2ను కూడా అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తోన్నారట. అందుకే షనయా హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, గెటప్ శీను కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జాంబీ రెడ్డి 2 సినిమాకు ప్రశాంత్ కేవలం కథను మాత్రమే అందిస్తున్నారు. సూపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ రానా నాయుడు వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించిన సూపర్న్ వర్మ జాంబీ రెడ్డి 2తోనే తెలుగులోకి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం జాంబీ రెడ్డి 2, హనుమాన్ సీక్వెల్ సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు తేజా సజ్జా.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే
- ●Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
- ●Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- ●Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్..

Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!

Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే

Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం






