DigiLocker | ఇక డిజిలాకర్‌లో విద్యుత్ బిల్లులు కూడా.. సులభంగా భద్రపరుచుకోవచ్చు..
DigiLocker | దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఆధార్, పాన్ వంటి పత్రాలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా అందించడంతోపాటు వాటిని ధ్రువీకరణ కోసం ఉపయోగించేందుకు కూడా డిజిలాకర్ ప్లాట్‌ఫామ్ ఎంతో దోహదం చేస్తోంది. దేశ పౌరులు తమ ముఖ్యమైన పత్రాలను ఆన్ లైన్‌లో సురక్షితంగా భద్రపరుచుకోవడంతోపాటు అవసరం అయిన చోట వాటిని ఆథెంటికేషన్ కోసం వాడవచ్చు.
DigiLocker | దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఆధార్, పాన్ వంటి పత్రాలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా అందించడంతోపాటు వాటిని ధ్రువీకరణ కోసం ఉపయోగించేందుకు కూడా డిజిలాకర్ ప్లాట్‌ఫామ్ ఎంతో దోహదం చేస్తోంది. దేశ పౌరులు తమ ముఖ్యమైన పత్రాలను ఆన్ లైన్‌లో సురక్షితంగా భద్రపరుచుకోవడంతోపాటు అవసరం అయిన చోట వాటిని ఆథెంటికేషన్ కోసం వాడవచ్చు. దీంతో లోన్లు తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం, పత్రాల ధ్రువీకరణ తదితర అంశాల్లో భౌతిక కాపీల అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే కంపెనీలు పౌరుల వివరాలను వెరిఫై చేయవచ్చు. ప్రస్తుతం ఆధార్, పాన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, మార్క్ షీట్ తదితర పత్రాలను కూడా డిజిలాకర్‌లో భద్రపరుచుకునే అవకాశం అందిస్తున్నారు. అయితే సోమవారం నుంచి విద్యుత్ బిల్లులను కూడా ఇందులో సేవ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డిజిలాకర్ ప్లాట్‌ఫామ్ తన ఎక్స్ ఖాతాలో వివరాలను వెల్లడించింది.
68 డిస్కంలకు మద్దతు..
దేశవ్యాప్తంగా ఉన్న 68 ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు చెందిన వినియోగదారులు డిజిలాకర్ ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీని సహాయంతో విద్యుత్ బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఒకసారి యాక్సెస్ చేసి సేవ్ చేస్తే డిజిలాకర్‌లో భద్రంగా ఉంటుంది. దీన్ని కావల్సినప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ధ్రువీకరణ కోసం వాడవచ్చు. దీని వల్ల విద్యుత్ బిల్లులను పేపర్ రూపంలో భద్రపరుచుకునే అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లోనే క్లౌడ్‌లో సురక్షితంగా ప్రతి నెలా బిల్స్ సేవ్ అవుతాయి. అలాగే బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. సాధారణంగా చాలా మంది వినియోగదారులు బిల్లు చెల్లించేందుకు పేమెంట్స్ యాప్‌లు లేదా ఈ-మెయిల్స్‌లో బిల్లు మొత్తం తనిఖీ చేస్తుంటారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా డిజిలాకర్ ద్వారానే విద్యుత్ బిల్లులను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం వినియోగదారులకు అందుబాటులో ఉందని డిజిలాకర్ వెల్లడించింది.
తాజావార్తలు
- ●Eesha Rebba | కొత్తింట్లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ - అమ్మ పేరు పెట్టానంటూ ఎమోషనల్ పోస్ట్
- ●Telangana Farmers Commission | ఎఫ్టీఎల్ ఆక్రమణలు కూల్చేయండి.. చెరువుల రక్షణకు కొత్త చట్టం
- ●Bakki Venkataiah | బాధితులు వస్తే తక్షణమే స్పందించండి.. సామాజిక న్యాయం పాటించండి
- ●Kidney Symposium 2026 | కిడ్నీ మార్పిడిలో అద్భుతాలు: 400+ సర్జరీలతో యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డ్
- ●Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
- ●Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ - బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?

Eesha Rebba | కొత్తింట్లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ - అమ్మ పేరు పెట్టానంటూ ఎమోషనల్ పోస్ట్

Telangana Farmers Commission | ఎఫ్టీఎల్ ఆక్రమణలు కూల్చేయండి.. చెరువుల రక్షణకు కొత్త చట్టం

Bakki Venkataiah | బాధితులు వస్తే తక్షణమే స్పందించండి.. సామాజిక న్యాయం పాటించండి

Kidney Symposium 2026 | కిడ్నీ మార్పిడిలో అద్భుతాలు: 400+ సర్జరీలతో యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డ్






