CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు
CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. గౌరవించండి అని రాష్ట్రంలోని గౌడన్నలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గౌడన్నలు ప్రభుత్వానికి అండగా నిలబడితే వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు ఖాయమని రేవంత్ దీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం నాది, భట్టి గారిదో కాదు
ఈ ప్రభుత్వం మీ అందరిది
మనకేమో కులవృత్తులు చేసుకోమన్నారు
వారి పిల్లలేమో రాజ్యాలను ఏలారు
ఇరిగేషన్ కాల్వ గట్లపై తాటి, ఈత చెట్లను నాటండి
సారవంతమైన కల్లు అందించగలుగుతాం
గౌడన్నలు అండగా నిలబడితే 117 సీట్లు ఖాయం
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : కులవృత్తులను కొనసాగించండి.. గౌరవించండి అని రాష్ట్రంలోని గౌడన్నలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గౌడన్నలు ప్రభుత్వానికి అండగా నిలబడితే వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు ఖాయమని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్ అయితే.. నాది సోషల్ జస్టిస్ అని సీఎం మరోసారి ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం నా ఒక్కడిదో, భట్టి గారి ఒక్కడిదో కాదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అని సీఎం స్పష్టం చేశారు. గీత కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు. సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో రేవంత్ ప్రసంగించారు.
గతంలో పదేండ్లు ఏలిన వారు.. అక్రమ సంపాదనతో మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకోండి.. చేపలు పట్టుకోండి.. చెప్పులు కుట్టుకోండి.. లేకపోతే చీరలు నేయండి.. గౌడన్నలు కల్లు గీయండని చెప్పారు. గత ప్రభుత్వం వాటిని ప్రోత్సహించింది. కానీ వారు, వారి పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలారు. ఇది ఎవరి దయాదక్షిణ్యాలతో వచ్చిన వృత్తి కాదు. తరతరాలుగా వచ్చిన వృత్తి ఇది. కులవృత్తినే ఆధారం చేసుకుని జీవనం సాగించారు.. పిల్లలను చదివించారు. తమ పిల్లలను ఓయూ, కేయూ వంటి యూనివర్సిటీలకు పంపిస్తే పీజీ, పీహెచ్‌డీలు చదివి, తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్నారు.. వాళ్లందరికి మేలు జరగాలి.. దాని కోసం మా ప్రభుత్వం ఉంటదని చెప్పిన అని సీఎం గుర్తు చేశారు.
కొన్నిసార్లు మన తలరాతను మనం మార్చుకోలేం
కొన్నిసార్లు మన తలరాతను మనం మార్చుకోలేం. కానీ మన పిల్లలను తలరాతను మార్చుకోవచ్చు. చదవాలన్న ఆకాంక్ష వల్ల పేదరికం వల్ల కులవృత్తికే అంకితమయ్యారు. కానీ ఇవాళ చైతన్యం వచ్చింది.. మధుయాష్కీ గౌడ్ అమెరికాలో గొప్ప న్యాయవాదిగా రాణించి, తెలంగాణకు తిరిగొచ్చి ఎంపీగా గెలిచారు. ఆయన చదువుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. ఎంతో మంది తెలియని వారికి అమెరికాలో దారి చూపించారు. అందుకే కులవృత్తిని కొనసాగించండి.. గౌరవించండి.. కానీ పిల్లను మాత్రం బడికి పంపించండి, చదవించండి. క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రీన్ చానెల్‌లో డబ్బులు ఇస్తాం. గత ప్రభుత్వంలో పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ అత్యుత్తమ నాణ్యతో కూడిన ఆహారం పెడుతున్నం. నేను, పొన్నం ప్రభాకర్ ఏ సన్నబియ్యం తింటున్నమో ఆ సన్నబియ్యంతోనే పిల్లలకు భోజనం పెట్టిస్తున్నాం. ప్రతి రోజు ఒక్కో రకమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టిస్తున్నం. కడుపు నిండా తింటే వింటున్న చదువు తలకెక్కుతుంది. అప్పుడు తలరాత మారుతుంది. మన పిల్లలు రాజ్యాన్ని ఏలాలంటే పిల్లలను చదివించాలి అని రేవంత్ సూచించారు.
మీకు 50 వేల కాటమయ్య కిట్లు ఇచ్చాం
ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి చెట్లు నాటండి.. ఇరిగేషన్ కాల్వల గట్ల మీద చెట్లను పెంచండి.. నీళ్లు ఉంటాయి. సారవంతమైన కల్తీ లేని కల్లు అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇది కుల వృత్తిని కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. గౌడన్నలు కులవృత్తిలో భాగంగా ఎంతో కష్టపడ్డారు, వృత్తిలో భాగంగా కొందరు ప్రాణాలు పోయినవారు ఉన్నారు. మీకు 50 వేల కాటమయ్య కిట్లు ఇచ్చాం. ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చినం అని సీఎం గుర్తు చేశారు.
గౌడన్నలు అండగా నిలబడితే 117 సీట్లు ఖాయం
మహేశ్ కుమార్ గౌడ్, నా కాంబినేషన్‌లో 2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. డీఎస్, వైఎస్ కలిసి రెండు పర్యాయాలు ఎలా అధికారంలోకి తెచ్చారో ఆ మాదిరి పార్టీని అధికారంలోకి తెస్తాం. గౌడన్నలు నూటికి నూరు శాతం సహకరించాలి. మళ్లీ 117 సీట్లతో గెలుస్తాం.. ఈ ప్రభుత్వం మనది.. మీరు అండగా నిలబడితే 117 సీట్లు ఖాయం అని సీఎం దీమా వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Mahesh Kumar | సీఎం రేవంత్‌రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్.. ఆయన మాకు సోదరుడి లాంటివారు
ఆగస్టు 18, 2026

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 18, 2026

Ramchandar Rao | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టండి
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..
- ●Chiranjeevi | ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ - 71 ఏళ్ల వయసులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్
- ●Mahesh Kumar | సీఎం రేవంత్‌రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్.. ఆయన మాకు సోదరుడి లాంటివారు
- ●India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
- ●Minister Tummala | రైతుల అవసరాలే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు ఉండాలి
- ●Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!

MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..

Chiranjeevi | ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ - 71 ఏళ్ల వయసులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్

Mahesh Kumar | సీఎం రేవంత్‌రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్.. ఆయన మాకు సోదరుడి లాంటివారు

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..



