Harish Rao | బీఆర్ఎస్ నేతల సనత్‌నగర్ టిమ్స్ సందర్శన.. హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్..
Harish Rao | సనత్‌నగర్‌లోని టిమ్స్ (Sanathnagar TIMS) దవాఖానకు పరిశీలనకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) తోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: సనత్‌నగర్‌లోని టిమ్స్ (Sanathnagar TIMS) దవాఖానకు పరిశీలనకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) తోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు నేతలను హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. కోకాపేటలోని హరీష్‌రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
దీంతో హౌస్ అరెస్ట్‌పై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. దవాఖానల్లోని వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీతో, పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హరీశ్ రావు హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రికి బీఆర్ఎస్ నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
సనత్ నగర్ TIMS ఆసుపత్రి కట్టింది నువ్వే అయితే హౌస్ అరెస్టులు ఎందుకు రేవంత్!
మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మన్నె క్రిశాంక్ హౌస్ అరెస్ట్
సనత్ నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో గృహనిర్బంధం
ఆసుపత్రిలో డొల్లతనం… https://t.co/DbeCEYBSdM pic.twitter.com/LSSOiuuBRN
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
- ●Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్
- ●Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..
- ●Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్
- ●Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్
- ●Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్

Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..

Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్

Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్






