Asaduddin Owaisi | ఆ సూపరింటెండెంట్ లంచాలు తీసుకొని రౌడీషీటర్లను వదులుతున్నరు
Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చంచల్‌గూడ సూపరింటెండెంట్‌పై సంచలన ఆరోపణలు చేశారు. లంచాలు తీసుకుంటూ జైల్లో ఉన్న రౌడీషీటర్లను బయటకు వదిలిపెడుతున్నారని ఆరోపించారు.
- ఎంఐఎం నేతలపై దాడులకు వ్యూహాలు రచిస్తున్నరు
- సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi | త్రినేత్ర న్యూస్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చంచల్‌గూడ సూపరింటెండెంట్‌పై సంచలన ఆరోపణలు చేశారు. లంచాలు తీసుకుంటూ జైల్లో ఉన్న రౌడీషీటర్లను బయటకు వదిలిపెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం నేతలపై దారులకు జైల్లోనే కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇచ్చి న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన రౌడీషీటర్ బెయిల్ తెచ్చుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‍లోని మీలాద్ మైదాన్‌లో ఆదివారం నిర్వహించిన 57వ 'జల్సా-ఎ-మిలాద్-ఉన్-నబి' సభలో ఒవైసీ మాట్లాడారు.
జైల్లోనే వ్యూహాలు..
అడ్వకేట్ హత్య కేసులో ఇటీవల విడుదలైన రౌడీషీటర్‌కు.. జైలు సూపరింటెండెంట్ సహకరిస్తున్నాడు.
దాడులకు చంచల్ గూడ జైల్లోనే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం జైల్లో ఖైదీలతో సూపరింటెండెంట్ సమావేశం అవుతున్నారు. లంచం తీసుకుని రౌడీషీటర్ల విడుదలకు సూపరింటెండెంట్ సహకరిస్తున్నాడు. అమాయకుల హత్యలకు పాల్పడే వారిని బహిష్కరించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి.
జంతర్‌మంతర్ కంటే హైదరాబాద్‌లో భారీ ఆందోళనలు చేస్తాం..
ఓటర్ల జాబితా ప్రత్యేక పోలింగ్ సవరణ (SIR) ప్రక్రియలో నకిలీ ఫారమ్-7 దరఖాస్తులను సమర్పిస్తూ ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోంది. తప్పుడు ఫారమ్-7లు దాఖలు చేస్తే బాధ్యులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. దరఖాస్తుదారుల వివరాలు లేకుండా ఓట్ల తొలగింపునకు ఫారాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎంఐఎం మౌనంగా కూర్చోద్దు. ఈ పరిస్థితి ఆగకపోతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ నిరసనల కంటే భారీగా హైదరాబాద్ రోడ్లు, వీధుల్లో ఆందోళనలు చేపడతాం అని ఒవైసీ హెచ్చరించారు.
బీజేపీ, సంఘ్ పరివార్‌ల కుట్ర
దరఖాస్తుదారుడి వివరాలు లేకుండానే ప్రింటెడ్ ఫారమ్-7 ఇస్తున్నారు. ఇది ముస్లిం వ్యక్తుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ, సంఘ్ పరివార్‌లకు చెందిన వ్యక్తులు కుట్రలు చేస్తున్నారు. ఫారమ్-7 విషయం ఏమాత్రం అనుమతించొద్దు. ఎస్ఐఆర్ అనేది ఎన్‌ఆర్‌సీ అమలుకు దొడ్డిదారిగా ఉంది. ఈ ప్రక్రియను బీజేపీ పౌరసత్వ పరీక్షగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది అని ఒవైసీ ఆరోపించారు.
తాజావార్తలు
- ●Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు
- ●Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్
- ●Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ
- ●KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం
- ●Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
- ●Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?

Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు

Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ

KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం




