త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhogi Teaser | భోగి టీజ‌ర్ రిలీజ్ – ర‌గ్గ్‌డ్ లుక్‌లో శ‌ర్వానంద్ – తెలంగాణ‌ అమ్మాయిగా అనుప‌మ

శ‌ర్వానంద్ భోగి మూవీ టీజ‌ర్ ఆదివారం రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌, యాస‌, భాష‌ల‌తో ఈ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. క‌మ్మ‌రోళ్ల గంగ అనే పాత్ర‌లో మాస్ రోల్‌లో ర‌గ్గ్‌డ్ లుక్‌తో శ‌ర్వానంద్ ఈ టీజ‌ర్‌లో కొత్త‌గా క‌నిపించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీ న‌వంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Oct 4, 2026, 1.11 pm IST

Bhogi Teaser | భోగి టీజ‌ర్ రిలీజ్ – ర‌గ్గ్‌డ్ లుక్‌లో శ‌ర్వానంద్ – తెలంగాణ‌ అమ్మాయిగా అనుప‌మ
Advertisement

Bhogi Teaser | శ‌ర్వానంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీ భోగి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ ర‌స్టిక్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

క‌మ్మ‌రోళ్ల గంగ‌...

భోగి మూవీ టీజ‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. తెలంగాణ నేప‌థ్య అంశాలు, యాస భాష‌ల‌తో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. దొర‌ల ఆధిప‌త్యాన్ని ఎదురించే క‌మ్మ‌రోళ్ల గంగ అనే పాత్ర‌లో ర‌గ్గ్‌డ్ లుక్‌లో శ‌ర్వానంద్ క‌నిపించారు. అత‌డి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌, డైలాగ్ డెలివ‌రీ, మాస్ డైలాగ్స్‌తో పాటు అత‌డిపై వ‌చ్చిన యాక్ష‌న్ స‌న్నివేశాలు టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఈ టీజ‌ర్‌లో ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది.

జాన‌ప‌దంతో...

ఓ ల‌చ్చ గుమ్మాడి అంటూ తెలంగాణ జాన‌ప‌దంతోనే ఈ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా మొద‌లైంది. దొర‌ల ఆధిప‌త్యం, వారిని ఎదురించి పోరాడే అణ‌గారిన వ‌ర్గానికి చెందిన ఓ యోధుడి పోరాటంతో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. మా అమ్మ‌బాపుల తోడు...ఆ తొమ్మిది మెట్ల‌ను నా క‌త్తితో క‌డిగి మీ నెత్తుటితో అల‌క‌క‌పోతే నేను క‌మ్మ‌రోళ్ల గంగ‌నే కాదు అంటూ ప‌వ‌ర్‌ఫుల్‌గా శ‌ర్వానంద్ చెప్పిన డైలాగ్ ఈ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

బోల్డ్ రోల్‌....

1960 బ్యాక్‌డ్రాప్‌లో ఆదిలాబాద్ - మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో కందుల సులోచ‌న‌రాణి పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌శ్వేర‌న్ న‌టిస్తోంది. మందారం అనే బోల్డ్ రోల్‌ను డింపుల్ హ‌య‌తి క‌నిపించ‌నుంది. భీమ్స్ మ్యూజిక్ అందించాడు.
టీజ‌ర్‌తో పాటు భోగి రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. న‌వంబ‌ర్ 12న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement