త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dost Notification | ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల.. ఎల్లుండి నుంచే రిజిస్ట్రేష‌న్‌ ప్ర‌క్రియ షురూ..

Dost Notification | తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ (Dost Notification) విడుదలైంది. 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి దోస్త్ ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

D

Hyderabad | Published On Apr 13, 2026, 1.07 pm IST

Dost Notification | ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల.. ఎల్లుండి నుంచే రిజిస్ట్రేష‌న్‌ ప్ర‌క్రియ షురూ..
Advertisement

Dost Notification | తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ (Dost Notification) విడుదలైంది. 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి దోస్త్ ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను (Dost Notification) ఉన్నత విద్యామండలి నేడు విడుద‌ల చేసింది. ఏప్రిల్‌ 15 నుంచి మే ఏడో తేదీ వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఉంటాయి. మే 14న తొలి విడత సీట్ల కేటాయింపు జరగనుంది.. సీటు పొందిన విద్యార్థులు మే 15 నుంచి మే 23వ తేదీ లోపు ఆన్‌లైన్‌ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

రెండో ఫేజ్‌ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 25 వరకు కొనసాగనుంది. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 30వ తేదీ సీట్లు కేటాయిస్తారు. మూడో ఫేజ్‌ రిజిస్ట్రేషన్లు మే 31 నుండి జూన్ 15 వరకు ఉంటాయి.
జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత సీట్ల కేటాయింపు అనంతరం కూడా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియక పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Also Read..

నోయిడాలో హింసాత్మ‌కంగా మారిన‌ కార్మికుల ఆందోళ‌న‌.. వాహ‌నాల‌కు నిప్పు

కేసీఆర్ కు లీగ‌ల్ నోటీస్.. 48 గంట‌ల్లో క్ష‌మాప‌ణ చెప్పాల‌న్న మంత్రి సీతక్క

నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాల్నా?: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం

Advertisement
Advertisement