Pocharam Srinivas Reddy | ఇచ్చిన మాట తప్పిన రేవంత్.. నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాల్నా?: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం
Pocharam Srinivas Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉందా?, ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు.
Pocharam Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉందా?, ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు లేపరని ధ్వజమెత్తారు. నిధులు మంజూరు చేయాలని మంత్రికి 20 సార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాల్నా? అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయని తెలిపారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే ఆయన నిరసన వ్యక్తం చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే సీనియర్ నేత జీవన్ రెడ్డి అధికార పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా సొంత ప్రభుత్వంపైనే పోచారం ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్‌ను (Siddapur Reservoir) పరిశీలించారు. నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితి, స్థానిక రైతుల సమస్యలను సమీక్షించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
`కొందరు మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను మంత్రులకు ఫోన్ చేసినా కనీస స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తాను గతంలో ప్రజా ప్రతినిధుల సమస్యల కోసం అర్ధరాత్రి ఫోన్ వచ్చినా స్పందించిన అనుభవం ఉందని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే నేతల ఫోన్లను కూడా లిఫ్ట్ చేయకపోవడం సరైన పద్ధతి కాదు. సీనియర్ ఎమ్మెల్యేగా తనకున్న అనుభవాన్ని మంత్రులు గుర్తుంచుకోవాలి. తాను నిన్న, మొన్న గెలిచిన వ్యక్తిని కాదు. సీనియార్టీని గౌరవించాలి. ప్రజా సమస్యలపై స్పందన లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయి. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు?. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు ఆగిపోతున్నాయి. పనులు నిలిచిపోతే మేము స్వయంగా బతిమిలాడి పనులు కొనసాగించే పరిస్థితి ఉంది. ఇది పాలనలో ఉన్న లోపాలను చూపిస్తున్నది` అని ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు
నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాల్నా?
మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలని అయినా పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు… https://t.co/YKP48zt8NS pic.twitter.com/ujNojel3AR
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2026
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



