One Way | సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు.. స్పెషల్‌గా బస్ లేన్లు!
One Way | ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు, ప్రత్యేక బస్ లేన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ విధానాల అమలుకు ప్రజలు, ఐటీ ఉద్యోగులు పోలీసులకు సహకరించాలని కోరారు.
- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్త ప్రతిపాదనలు
- ప్రజలు, ఐటీ ఉద్యోగులు సహకరించాలన్న డీజీపీ సీవీ ఆనంద్
- సైబరాబాద్ మూవ్స్–2026’ సదస్సు ప్రారంభం
One Way | ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు, ప్రత్యేక బస్ లేన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ విధానాల అమలుకు ప్రజలు, ఐటీ ఉద్యోగులు పోలీసులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్–2026’ సదస్సును ఆయన ప్రారంభించారు.
సైబరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై సమగ్ర చర్చ, పరిష్కార మార్గాల అన్వేషణ లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ, బొగోటా మాజీ మేయర్ ఎన్రిక్ పెనలోసా తదితరులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్‌తోపాటు ఐటీ సంస్థల ప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
లక్షల మంది రాకపోకలతో ట్రాఫిక్ ఒత్తిడి
గత 20 ఏళ్లలో సైబరాబాద్ ప్రాంతం వేగంగా విస్తరించిందని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 లక్షల మంది పనిచేస్తున్నారని, వారిలో దాదాపు 80 శాతం మంది కార్లలోనే కార్యాలయాలకు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. దీంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందన్నారు. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచేందుకు వివిధ నగరాలు అనుసరిస్తున్న విధానాలను సదస్సులో చర్చించినట్లు తెలిపారు.
సైబరాబాద్ పోలీసులు, సీఎంసీ ఇప్పటికే పలు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ సమస్య కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మరింత సమర్థవంతమైన పరిష్కారాలను రూపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. రోడ్డు కూడళ్ల అభివృద్ధి, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు, సెక్యూరిటీ కౌన్సిల్, లివింగ్ ల్యాబ్ సంస్థలు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రజా రవాణా వినియోగం పెంపు, ట్రాఫిక్ నిర్వహణలో మెరుగైన విధానాల అమలుపై ఈ సదస్సులో చర్చించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..
- ●KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
- ●Manne Krishank | బావర్చి హోటల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
- ●Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేదన్న అధికారులు..!
- ●KCR | సారే రావాలంటున్నది ఈ సర్వే
- ●CM Revanth Reddy | అచ్చంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..

KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

Manne Krishank | బావర్చి హోటల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేదన్న అధికారులు..!



