త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CV Anand | ఏఐ పోలీస్ స్టేష‌న్‌గా పంజాగుట్ట‌.. ప‌నుల‌ను ప‌రిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్‌

CV Anand | దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట ఠాణా రూపుదిద్దుకుంటున్నది. ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌ నుంచి చార్జ్‌షీట్ త‌యారీ వరకు ఏఐ సేవ‌ల‌ను వినియోగించ‌నున్నారు. పైల‌ట్ ప్రాజెక్టులో భాగంగా పంజాగుట్ట పీఎస్‌లో కొన‌సాగుతున్న సాంకేతిక ప‌నుల‌ను డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) , హైదరాబాద్ సీపీ డాక్టర్ మహేశ్ భగవత్ పనులను పరిశీలించారు.

G

Hyderabad | Published On Nov 25, 2026, 6.01 pm IST

CV Anand | ఏఐ పోలీస్ స్టేష‌న్‌గా పంజాగుట్ట‌.. ప‌నుల‌ను ప‌రిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్‌
Advertisement

CV Anand | త్రినేత్ర న్యూస్‌: దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట ఠాణా రూపుదిద్దుకుంటున్నది. ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌ నుంచి చార్జ్‌షీట్ త‌యారీ వరకు ఏఐ సేవ‌ల‌ను వినియోగించ‌నున్నారు. పైల‌ట్ ప్రాజెక్టులో భాగంగా పంజాగుట్ట పీఎస్‌లో కొన‌సాగుతున్న సాంకేతిక ప‌నుల‌ను డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) , హైదరాబాద్ సీపీ డాక్టర్ మహేశ్ భగవత్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, ఏఐ వ్యవస్థ ద్వారా వారి సమస్యలను సిబ్బంది ఏ విధంగా స్వీకరించి పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఠాణాలోని సిబ్బంది పనితీరును, ఏఐ సాంకేతికత సహాయంతో వారు విధులను ఏ విధంగా నిర్వహిస్తున్నారో పర్యవేక్షించారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ, ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్‌లతో కలిసి స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సాంకేతిక మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌ను పైలట్ ప్రాజెక్టుగా త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) అకున్ సభర్వాల్, హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) ఎం. శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, టీఎస్‌పార్క్ (TSPARK) ఎస్పీ రూపేశ్, డీసీపీ (స్మిత్) అరవింద్ బాబు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement