Indian Army | ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఆఫీసర్లు.. అవివాహిత పురుషులు అర్హులు..
Indian Army | ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ (Indian Army) అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నది. ఆకర్షణీయమైన వేతనంతోపాటు, దేశ సేవకు బాటలు వేస్తున్నది. 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (Technical) కోర్సులో ప్రవేశాల కోసం 350 టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Indian Army | త్రినేత్ర.న్యూస్: ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ (Indian Army) అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నది. ఆకర్షణీయమైన వేతనంతోపాటు, దేశ సేవకు బాటలు వేస్తున్నది. 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (Technical) కోర్సులో ప్రవేశాల కోసం 350 టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అర్హత, ఆసక్తి కలిగినవారు ఆగస్టు 7 వరకు అధికారిక వెబ్సైట్లో www.joinindianarmy.nic.in. దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎంఐఎస్సీ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైనవారికి ప్రతి నెల రూ.56,100 నుంచి రూ.1,77,500 జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్)-68 పురుషులు - 350 పోస్టులు
అర్హతలు: ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎంఐఎస్సీ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లతో బీఈ/బీటెక్ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నిర్ణీత తేదీలోపు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలి. 2027 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే, 2000 ఏప్రిల్ 1 నుంచి 2007 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్: 2.4 కి.మీ. పరుగు 10.30 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. పుష్-అప్స్ 40, పుల్-అప్స్ 6; సిట్ అప్స్- 30 తీసే శారీరక సామర్థ్యం ఉండాలి. అదేవిధంగా ఈతలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక విధానం: డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ (స్టేజ్-1, స్టేజ్-2), వైద్య పరీక్షలు, మెరిట్ ప్రకారం ఎంపిచేస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 7
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, ప్రయాగ్‌రాజ్, జలంధర్.
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
- ●Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి
- ●Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..
- ●CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ.. షేర్ ధర రూ.574, రిటైల్ పెట్టుబడిదారులు ఎంత పెట్టాలి?

Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!

Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి

Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..






