Danam Nagender | ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్..
Danam Nagender | ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. టస్కర్ ముందు దానం నాగేందర్ (Danam Nagender) కొబ్బరికాయ కొట్టారు. అనంతరం శోభాయాత్ర (Ganesh Shobha Yatra) ప్రారంభమైంది.
Danam Nagender | త్రినేత్ర న్యూస్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. టస్కర్ ముందు దానం నాగేందర్ (Danam Nagender) కొబ్బరికాయ కొట్టారు. అనంతరం శోభాయాత్ర (Ganesh Shobha Yatra) ప్రారంభమైంది. భారీ జనసందోహం నడుమ గణేశుడి శోభాయాత్ర ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా మహాగణపతి ఎదుట దానం నాగేందర్ నృత్యం చేశారు. ఆయనతోపాటు మహిళా కానిస్టుబుల్లు, స్థానిక నాయకులు కూడా డ్యాన్స్ చేశారు.

కాగా, మహాగణపతి శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపంతో బడా గణేశ్ టస్కర్‌పైకి ఆలస్యంగా చేరాడు. దీంతో ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర, 3 గంటల ఆలస్యంగా అంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఎక్కడా ఆగకుండా స్వామివారు ముందుకు సాగుతున్నారు. మరోవైపకు మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భవనాలపై నుంచి భక్తులు పూలు జల్లుతున్నారు. శోభాయాత్ర ఆలస్యం అవుతుండటంతో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్నది.

అయితే మధ్యాహ్నం లోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. ఉత్సవాల పేరుతో అసభ్యకర ప్రవర్తనను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

క్రేన్ నంబర్ 5 వద్ద మహా గణపతి నిమజ్జనం
69 అడుగుల ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాట్లు చేశారు. క్రేన్ నంబర్ 5 వద్ద మహా గణపతి నిమజ్జనం కానుంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణతల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
https://youtube.com/shorts/WtAmJS8w76E?si=RtdisIpQtbVQ68KW
Khairabad Bada Ganesh Shoba Yatra Commenced
Meanwhile Women Cops & Danam Nagender danced to the tune of Aaya Sher during Yatra
Police deployed to see the procession and Nimarjan concludes peacefully pic.twitter.com/2bCOQYgtJK
— Sowmith Yakkati (@YakkatiSowmith) September 25, 2026
తాజావార్తలు
- ●Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
- ●Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
- ●PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..
- ●Stock Markets | షార్ప్ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. సెన్సెక్స్ 173 పాయింట్లు అప్..

Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు

YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..

Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?






