Amul Milk Price Hike | సామాన్యులకు షాక్.. అమూల్ పాల ధరలు పెంపు
Amul Milk Price Hike | నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో భారం పడనుంది. ఇప్పటికే మదర్ డెయిరీ పాల ధరలను పెంచగా.. తాజాగా ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కూడా ధరల పెంపును ప్రకటించింది. లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.4 వరకు పెంచుతున్నట్లు బుధవారం వెల్లడించింది.
- లీటర్‌పై రూ.2 నుంచి రూ.4 వరకు పెంపు..
- రేపటి నుంచి పెంచిన ధరలు అమల్లోకి
- పశుగ్రాసం, ప్యాకేజింగ్, రవాణా ఖర్చుల పెరుగుదలతో నిర్ణయం
Amul Milk Price Hike | నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో భారం పడనుంది. ఇప్పటికే మదర్ డెయిరీ పాల ధరలను పెంచగా.. తాజాగా ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కూడా ధరల పెంపును ప్రకటించింది. లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.4 వరకు పెంచుతున్నట్లు బుధవారం వెల్లడించింది. సవరించిన ధరలు నవంబర్ 12 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రతిరోజూ పాలు కొనుగోలు చేసే కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడనుంది. పశుగ్రాసం, ప్యాకేజింగ్ సామగ్రి, ఇంధన ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమూల్ మాతృసంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది.
ధరల పెంపునకు కారణాలివే..
పాల ఉత్పత్తి వ్యయం పెరగడం డెయిరీ సంస్థలకు భారంగా మారింది. ముఖ్యంగా పశువుల దాణా, పశుగ్రాసం ధరలు పెరగడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు ప్యాకేజింగ్ సామగ్రి, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. వీటికి తోడు పాలలో కీలకమైన కొవ్వు పదార్థం (మిల్క్ ఫ్యాట్) ధరలు గత కొన్ని నెలల్లో 20 నుంచి 25 శాతం వరకు పెరిగినట్లు సమాచారం. తాజా పాల సేకరణ తగ్గినప్పుడు పాల పొడి, ఫ్యాట్ వినియోగించి పాలు తయారు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. వాటి ధరలు పెరగడంతో కంపెనీలకు ఉత్పత్తి వ్యయం అధికమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ధరలు పెంచాల్సి వచ్చినట్లు డెయిరీ వర్గాలు చెబుతున్నాయి.
చలికాలంలోనూ సరఫరాపై ఒత్తిడి
సాధారణంగా చలికాలాన్ని డెయిరీ రంగంలో ఫ్లష్ సీజన్‌గా పరిగణిస్తుంటారు. ఈ సమయంలో పశువుల నుంచి పాల ఉత్పత్తి పెరగడంతో మార్కెట్‌లో సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాల సేకరణ, పశువుల ఉత్పాదకతపై ఒత్తిడి నెలకొనడంతో సరఫరా వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు పాల కొవ్వు ధరలు పెరగడం కూడా కంపెనీలకు సమస్యగా మారింది. దీంతో సాధారణంగా ధరలు స్థిరంగా ఉండాల్సిన సమయంలోనూ వినియోగదారులపై భారం పడుతోంది.
పాడి రైతులకు మెరుగైన ధరలు
ఒకవైపు వినియోగదారులకు ధరల పెంపు భారంగా మారుతున్నప్పటికీ.. మరోవైపు పాడి రైతులకు మెరుగైన ధరలు అందించేందుకు డెయిరీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. పాల సేకరణను పెంచడంతోపాటు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రైతులకు చెల్లించే కొనుగోలు ధరలను పెంచినట్లు సమాచారం. అమూల్ పాల ఫ్యాట్ కొనుగోలు ధరను కిలోకు రూ.1,000కి పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో నాణ్యత, ఫ్యాట్ శాతం ఆధారంగా రైతులకు లీటర్ పాలకు రూ.60కుపైగా లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
నవంబర్ 11, 2026

Bhogi Postponed | వాయిదా పడిన శర్వానంద్ ‘భోగి’.. అఫీషియల్‌గా ప్రకటించిన మేకర్స్..
నవంబర్ 11, 2026

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ల జోరు.. ఏకంగా 60 స్థానాలు ఎగబాకిన గుర్నూర్
నవంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Delhi Winter Fog Science | ఢిల్లీని కమ్మేసే దట్టమైన పొగమంచు.. హైదరాబాద్, బెంగళూరుల్లో ఎందుకు కనిపించదు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
- ●Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
- ●Gauhati High Court | పాన్ కార్డు, ఓటరు ఐడీ భారతీయ పౌరసత్వానికి ఆధారాలు కావు.. గువాహటి హైకోర్టు స్పష్టీకరణ
- ●KTR | వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోసింది కేసీఆరే
- ●Telangana 12th Class System | తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి స్కూల్లోనే 12వ తరగతి వరకు చదవొచ్చు
- ●KTR | నా గడ్డం మీద రేవంత్ రెడ్డికి ఫికర్ పడ్డది

Delhi Winter Fog Science | ఢిల్లీని కమ్మేసే దట్టమైన పొగమంచు.. హైదరాబాద్, బెంగళూరుల్లో ఎందుకు కనిపించదు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ

Gauhati High Court | పాన్ కార్డు, ఓటరు ఐడీ భారతీయ పౌరసత్వానికి ఆధారాలు కావు.. గువాహటి హైకోర్టు స్పష్టీకరణ

KTR | వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోసింది కేసీఆరే



