త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

China Manja | చైనా మాంజాపై విక్ర‌యాల‌పై పోలీసుల ఉక్కుపాదం.. కూకట్‌పల్లి జోన్‌లో స్పెషల్ డ్రైవ్

China Manja | పర్యావరణానికి, పక్షులకు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు ప్రాణసంక‌టంగా మారిన చైనా మాంజాపై (China Manja) పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిషేధిత మాంజా విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు కూకట్‌పల్లి జోన్‌లో పోలీసులు (Kukatpally Police) స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించారు.

G

Hyderabad | Published On Jan 30, 2026, 10.40 am IST

China Manja | చైనా మాంజాపై విక్ర‌యాల‌పై పోలీసుల ఉక్కుపాదం.. కూకట్‌పల్లి జోన్‌లో స్పెషల్ డ్రైవ్
Advertisement

త్రినెత్ర‌.న్యూస్‌: పర్యావరణానికి, పక్షులకు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు ప్రాణసంక‌టంగా మారిన చైనా మాంజాపై (China Manja) పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిషేధిత మాంజా విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు కూకట్‌పల్లి జోన్‌లో పోలీసులు (Kukatpally Police) స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించారు. కూక‌ట్‌ప‌ల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో బాలానగర్, అల్లాపూర్, మియాపూర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ల‌ పరిధిలో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా మాదాపూర్ పీఎస్ పరిధిలో 11 షాపులు, రాయదుర్గం పీఎస్ పరిధిలో 15, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో 11, మియాపూర్‌లో 6, కూకట్‌పల్లిలో 8, బాలానగర్‌లో 4, అల్లాపూర్‌లో ఒక దుకాణంలో తనిఖీలు చేపట్టారు. మొత్తంగా 56 షాపుల‌పై ఆక‌స్మిక రైడ్‌లు చేశారు. ఇందులో 30 గాలిపటాల దుకాణాలు ఉండ‌గా, నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై 5 కేసులు నమోదు చేశారు. ఇందులో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, అల్లాపూర్ పీఎస్‌, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. దీంతోపాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు, విద్యార్థులకు చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా రోడ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న మాంజా దారాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో తొలగించారు. నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కూకట్‌పల్లి జోన్ డీసీపీ ప్రజలను కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement