త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

 Khulsumpura Traffic Police Special Drive | సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్పెష‌ల్ డ్రైవ్‌లో దొరికిపోయారు.. ఎన్ని కేసుల‌య్యాయంటే!

 Khulsumpura Traffic Police Special Drive | సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వాహ‌న‌దారుల‌పై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

S

Hyderabad | Published On Oct 24, 2026, 4.46 pm IST

 Khulsumpura Traffic Police Special Drive | సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్పెష‌ల్ డ్రైవ్‌లో దొరికిపోయారు.. ఎన్ని కేసుల‌య్యాయంటే!
Advertisement

Khulsumpura Traffic Police Special Drive | త్రినేత్ర న్యూస్: సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వాహ‌న‌దారుల‌పై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ (Khulsumpura Traffic Police) స్టేషన్ పరిధిలోని రేతిబౌలి జంక్షన్ వద్ద శుక్ర‌వారం ప్ర‌త్యేక డ్రైవ్ (Special Drive) నిర్వ‌హించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న‌ 40 మందిని అదుపులోకి తీసుకుని కేసులు న‌మోదు చేశారు.

గోల్కొండ జోన్ ఏసీపీ ధనలక్ష్మి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ ఈ తనిఖీల్లో భాగంగా 40 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారికి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రయాణికులు, తోటి వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రత్యేక తనిఖీల్లో కుల్సుంపూరా ట్రాఫిక్ పి.ఎస్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేంద్రప్రసాద్ తో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement