Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
Traffic Jam | బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో నగర వాసులు సొంతూర్ల బాట పట్టారు. ఈ క్రమంలో నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక హైదరాబాద్ సిటీ నుంచి జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఆయా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.
Traffic Jam | త్రినేత్ర న్యూస్ : బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో నగర వాసులు సొంతూర్ల బాట పట్టారు. ఈ క్రమంలో నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక హైదరాబాద్ సిటీ నుంచి జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఆయా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దీంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
ప్రధానంగా హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - కరీంనగర్, హైదరాబాద్ - కర్నూల్ హైవేలపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ మార్గాల్లో ఉన్న టోల్ ప్లాజాల వద్ద సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద నెమ్మదిగా ట్రాఫిక్ ముందుకు కదులుతుంది. కార్లు అయితే బారులు తీరాయి. చౌటుప్పల్ వద్ద ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతుండడంతో.. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
హైదరాబాద్ - కర్నూల్ హైవేపై ఉన్న రాయికల్ టోల్ ప్లాజా వద్ద మరింత రద్దీ ఏర్పడింది. బాలానగర్‌లో ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో జడ్చర్ల, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. పిల్లలు, మహిళలు అయితే సీట్ల కోసం పాట్లు పడుతున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | పండుగలు వస్తే చాలు.. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా రేవంత్?: హరీశ్ రావు
అక్టోబర్ 18, 2026

ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
అక్టోబర్ 17, 2026

Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
- ●Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!
- ●Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ
- ●BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
- ●Jalamandali | తాగునీటి దుర్వినియోగం.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ. 20 వేల జరిమానా
- ●CP Sajjanar | డ్రగ్స్ కట్టడిపై మీ ఆలోచన సూపర్.. ఈ ప్రయత్నం ప్రతొక్కరికీ మార్గదర్శకం కావాలి

MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి

Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!

Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ

BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు



