Telangana | మేడమ్.. 700 మంది అమ్మాయిలకు రెండే టాయిలెట్లు.. ఇదీ గిరిజన బాలికల ఆవేదన
Telangana | తమ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలపై తెలంగాణ గిరిజన బాలికల వసతి గృహం విద్యార్థినులు రోడ్డెక్కారు. హాస్టల్‌లో అపరిశుభ్ర వాతావరణంలో ఉండలేకపోతున్నామని, 700 మంది అమ్మాయిలకు కేవలం రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని బాధిత విద్యార్థినులు వాపోయారు.
Telangana | త్రినేత్ర.న్యూస్ : తమ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలపై తెలంగాణ గిరిజన బాలికల వసతి గృహం విద్యార్థినులు రోడ్డెక్కారు. హాస్టల్‌లో అపరిశుభ్ర వాతావరణంలో ఉండలేకపోతున్నామని, 700 మంది అమ్మాయిలకు కేవలం రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని బాధిత విద్యార్థినులు వాపోయారు. ఈ విషయంపై ఇప్పటికే హాస్టల్ యాజమాన్యానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదు. ఇప్పటికైనా మీరు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించండి అని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో సుమారు 700 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అయితే హాస్టల్‌లో నెలకొన్ని అపరిష్కృత సమస్యలపై గురువారం విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు తమ బాధను మీడియాకు చెప్పుకున్నారు.
మాకు దోమలు, పురుగులు కుట్టి శరీరం మొత్తం అలర్జీ లాగా అవుతుంది. రూల్ నంబర్లు వేసి మాతో బాత్రూంలు క్లీన్ చేయిస్తున్నారు. ఇదేంటని అడిగితే వేధిస్తున్నారు. మేం పిల్లలం. తలా 20 రూపాయలు ఇస్తే బాత్రూంలు క్లీన్ చేయిస్తాం, లేదంటే మీరే చేసుకోండి అని ప్రిన్సిపాల్ మేడం అంటుంది. సంవత్సరం నుండి సరిగ్గా నీళ్లు రావట్లేదు. అడిగితే మార్కులు కట్ చేసి ఫెయిల్ చేస్తామని భయపెడుతున్నారని గురుకుల పాఠశాల బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజులుగా తాగునీరు రావడం లేదని, వాష్‌రూమ్‌లలో కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు పేర్కొన్నారు. పంప్ రిపేర్ చేయించమని ఉపాధ్యాయులను అడిగితే, వాళ్లు మమ్మల్నే తిరిగి డబ్బులు అడిగి వేధిస్తున్నారని.. తమకు వెంటనే నీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
మంత్రి సీతక్క జోక్యంతో శాంతించిన విద్యార్థినులు
విద్యార్థినుల సమస్యలపై మంత్రి సీతక్క స్పందించారు. టాయిలెట్ల కొరతను తీర్చుతామని, పరిశుభ్రత విషయంలో చర్యలు తీసుకుంటామని విద్యార్థినులకు ఆమె హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మంత్రి సీతక్క జోక్యంతో విద్యార్థినులు శాంతించి, తిరిగి హాస్టల్‌కు వెళ్లిపోయారు.
తాగడానికి కూడా నీళ్లు ఇవ్వరా అంటూ గురుకుల విద్యార్థినుల ధర్నా
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల నిరసన
నెల రోజులుగా తాగునీరు రావడం లేదని, వాష్‌రూమ్‌లలో కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినుల… pic.twitter.com/Q5gtjRlpQM
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026
తాజావార్తలు
- ●Amberpet Constable Suicide | అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
- ●Kerala Rains | కేరళలో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చరికలు
- ●Toxic OTT | ట్రిమ్ వెర్షన్తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ - బోల్డ్ సీన్లు కట్!
- ●Rashmika Mandanna | షూటింగ్ అంటేనే వణికిపోయా - మైసాపై రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Stock Markets | మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ.. 478 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Amberpet Constable Suicide | అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

Kerala Rains | కేరళలో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చరికలు

Toxic OTT | ట్రిమ్ వెర్షన్తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ - బోల్డ్ సీన్లు కట్!






