RRB Recruitment | సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ పోస్టులు
RRB Recruitment | దేశవ్యాప్తంగా రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న సెక్షన్ కంట్రోలర్ (Section Controller) పోస్టులను భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 119 పోస్టులను భర్తీ చేస్తున్నది.
RRB Recruitment | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న సెక్షన్ కంట్రోలర్ (Section Controller) పోస్టులను భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 119 పోస్టులను భర్తీ చేస్తున్నది. డిగ్రీ పూర్తిచేసినవారు ఆగస్టు 14 వరకు rrbapply.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే నెలకు రూ.35,400 అందుతుంది. ఇతర బెనిఫిట్స్ ఉంటాయి. సికింద్రాబాద్ జోన్‌లో 5 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 119
జోన్లవారీగా.. సికింద్రాబాద్ 5, రాంచీ 14, అహ్మదాబాద్ 11, జమ్ము అండ్ శ్రీనగర్ 10, చెన్నై 9, కోల్‌కతా 8, బెంగళూరు 8, మాల్దా 7, భోపాల్ 6, భువనేశ్వర్ 6, చండీగఢ్ 6, ముంబై 6, పాట్నా 6, సిలిగురి 5, గోరఖ్‌పూర్ 5, తిరువనంతపురం 4, ప్రయాగ్‌రాజ్ 4, బిలాస్‌పూర్ 4, ముజఫర్‌పూర్ 3, గువాహటి 1, అజ్మీర్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి, 2026 జూలై 1 నాటికి 20 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: మొత్తం 4 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (CBT), కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్.
రాతపరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు. అనలిటకల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ నుంచి 60 ప్రశ్నలు, లాజికల్ కేపబిలిటీ 20, మెంటల్ రీజనింగ్ 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.500, (పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్ చేస్తారు), ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఈబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 16
వెబ్సైట్ : rrbapply.gov.in
పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 71 పారామెడికల్ పోస్టులు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు
సెప్టెంబర్ 15, 2026

Special Trains | వరుస సెలవులు.. నేడు, రేపు సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..
సెప్టెంబర్ 12, 2026

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●MMTS | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..
- ●BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
- ●Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
- ●KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
MMTS | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు

iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ



