Traffic Restrictions | బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | వాహనదారులకు పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. సోమవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు చేపట్టనున్న పాదయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | వాహనదారులకు పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. సోమవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు చేపట్టనున్న పాదయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నవంబర్ 2న మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు పరిస్థితిని బట్టి వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. బషీర్‌బాగ్, లిబర్టీ, రవీంద్రభారతి, అబిడ్స్, నాంపల్లి, జీపీఓ, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రధాన జంక్షన్ల వద్ద మళ్లింపులు
ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్, రవీంద్రభారతి వైపు మళ్లించనున్నారు. జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ వైపు పంపిస్తారు. తాజ్ ఐలాండ్ నుంచి ఓల్డ్ ఏబీసీ లేన్, యూసుఫ్ అండ్ కంపెనీ, ట్రూప్ బజార్ మీదుగా బ్యాంక్ స్ట్రీట్ వెళ్లే వాహనాలను అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలు లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్ వైపు వెళ్లాలి. హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. రాజారెడ్డి మార్గ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వద్ద ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్ వైపు పంపిస్తారు. ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి నుంచి చాపెల్ రోడ్, సుజాత స్కూల్ జంక్షన్, ఎస్‌బీఐ రోడ్ వెళ్లే వాహనాలను చాపెల్ రోడ్ టీ జంక్షన్ వద్ద వెనక్కి మళ్లిస్తారు. కింగ్‌కోఠి నుంచి తాజ్‌మహల్ హోటల్ జంక్షన్, అబిడ్స్ వెళ్లే వాహనాలు బషీర్‌బాగ్, బొగ్గులకుంట వైపు వెళ్లాలి. బొగ్గులకుంట నుంచి బాటా టీ జంక్షన్ మీదుగా అబిడ్స్ వెళ్లేందుకు అనుమతి ఉండదు. వాహనాలను కింగ్‌కోఠి, మయూరి పాన్ షాప్ వైపు మళ్లిస్తారు. స్టాన్లీ కాలేజ్, సుజాత స్కూల్ వైపు వాహనాలను అనుమతించరు. రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి నాంపల్లి ఎక్స్ రోడ్స్, ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు దారి మళ్లిస్తారు. ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్ వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు పంపిస్తారు. జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు రాకపోకలను నిలిపివేయనున్నారు.
ఈ జంక్షన్లకు దూరంగా ఉండండి
మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు లిబర్టీ, రవీంద్రభారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, ఏఆర్ పెట్రోల్ పంప్, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి, జీపీఓ, నాంపల్లి టీ జంక్షన్, తాజ్ ఐలాండ్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్ ప్రాంతాల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. పీటీఐ నుంచి రవీంద్రభారతి, కార్ఖానా నుంచి రవీంద్రభారతి, కట్టమైసమ్మ నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి లిబర్టీ, శ్మశానవాటిక జంక్షన్ నుంచి ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్ నుంచి బ్యాంక్ స్ట్రీట్, రామ్‌కోఠి నుంచి అబిడ్స్, చాదర్‌ఘాట్ నుంచి ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ నుంచి ఎంజే మార్కెట్ మార్గాల్లోనూ ఆంక్షలు ఉండనున్నాయి. ఇవే కాకుండా ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం నుంచి డీఎంహెచ్‌ఎస్, భూలక్ష్మి టెంపుల్ నుంచి ఎంజే మార్కెట్, బోయిగూడ ఖమాన్ నుంచి మలకుంట టీ జంక్షన్, ఎంజే మార్కెట్ నుంచి రవీంద్రభారతి, గోకుల్ నగర్ నుంచి నాంపల్లి ఎక్స్ రోడ్స్ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలగనుంది. రసూల్‌పురా జంక్షన్ నుంచి రాణిగంజ్, పంజాగుట్ట ఎక్స్ రోడ్స్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వెళ్లేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆర్టీసీ బస్సుల రూట్ కూడా..
పాదయాత్ర నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ మార్పులు చేపట్టనున్నారు. రవీంద్రభారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే బస్సులను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ వెళ్లే బస్సులను తాజ్ ఐలాండ్ వైపు పంపిస్తారు. అప్పర్ ట్యాంక్‌బండ్, ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం నుంచి లిబర్టీ వైపు వచ్చే బస్సులు తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా వెళ్లాలి. జిల్లాల నుంచి రాణిగంజ్, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే బస్సులను సీటీఓ జంక్షన్ వద్ద రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లించనున్నారు. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని కోరారు. పాఠశాలల నుంచి పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ముందస్తుగా ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా, అత్యవసర సహాయం కావాలన్నా 9010203626 నంబర్‌కు ఫోన్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BJP Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని తరిమికొట్టాలి
- ●Revanth Reddy Delhi Speech | దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర
- ●Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే - కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
- ●KTR Adilabad Tour | ఆ రైతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సాయం అందించిన కేటీఆర్
- ●CS Sanjay Jaju | పారిశ్రామిక అభివృద్ధికి రహదారి కనెక్టివిటీ కీలకం
- ●TG Oilfed | ఆయిల్‌పామ్‌లో టీజీ ఆయిల్‌ఫెడ్ సరికొత్త రికార్డు

BJP Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని తరిమికొట్టాలి

Revanth Reddy Delhi Speech | దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర

Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే - కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?

KTR Adilabad Tour | ఆ రైతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సాయం అందించిన కేటీఆర్




