త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthi Richmond Villas | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు.. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌కు నోటీసులు

Keerthi Richmond Villas | మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌డుతున్న‌ గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ ప్రాజెక్టుకు భూసేక‌ర‌ణ నేప‌థ్యంలో రాజేంద్ర‌న‌గ‌ర్ బండ్ల‌గూడ‌ ప‌రిధిలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌కు మ‌ళ్లీ నోటీసులు జారీ చేశారు.

S

Hyderabad | Published On May 4, 2026, 2.45 pm IST

Keerthi Richmond Villas | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు.. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌కు నోటీసులు
Advertisement

Keerthi Richmond Villas | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌డుతున్న‌ గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ ప్రాజెక్టుకు భూసేక‌ర‌ణ నేప‌థ్యంలో రాజేంద్ర‌న‌గ‌ర్ బండ్ల‌గూడ‌ ప‌రిధిలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌కు మ‌ళ్లీ నోటీసులు జారీ చేశారు. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ ఓన‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఇంద్ర‌ప్ర‌కాశ్‌కు జారీ చేసిన నోటీసులు మీడియా చేజిక్కించుకుంది.

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు భూ సేక‌ర‌ణ‌లో భాగంగా.. షెడ్యూల్డ్ ల్యాండ్‌ను సేక‌రించాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. ఈ క్ర‌మంలో విల్లాస్ య‌జ‌మానుల నుంచి అభ్యంత‌రాల‌ను స్వీక‌రించేందుకు మే 6వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజ‌న‌ల్ కార్యాల‌యంలో స‌మావేశం ఏర్పాటు చేయ‌బ‌డింది. ఈ మేర‌కు నోటీసులు జారీ చేస్తున్న‌ట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే ప్రెసిడెంట్ ఇంద్ర‌ప్ర‌కాశ్ షెడ్యూల్డ్ ల్యాండ్‌ను సేక‌రించాల‌నే ప్ర‌తిపాద‌న‌పై అభ్యంత‌రం తెలుపుతూ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన రాజేంద్ర‌న‌గ‌ర్ ఆర్డీవోను సంప్ర‌దించారు. ఈ విష‌యంలో చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ఆర్డీవో ఆదేశించారు.

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ అనేది గేటెడ్ క‌మ్యూనిటీ. ఇది స‌న్ సిటీ ప్రాంతంలో ఉంది. 24 ఎక‌రాల్లో ఈ గేటెడ్ క‌మ్యూనిటీ ఏర్పాటు చేశారు. అయితే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు కోసం భూమిని సేక‌రించ‌డానికి ఆర్డీవో ప‌బ్లిక్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌డంతో.. ఈ విల్లాస్ వెలుగులోకి వ‌చ్చాయి. మూసీ జ‌న ఆందోళ‌న్ లో భాగ‌స్వాములైన కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ య‌జ‌మానులు పోరుబాట ప‌ట్టారు.

Advertisement
Advertisement