Alluri Birth Anniversary | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Birth Anniversary | సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు అందించే నిజమైన నివాళని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద శనివారం ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Birth Anniversary | సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు అందించే నిజమైన నివాళని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద శనివారం ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
ఆయన చేసిన సాహసోపేత పోరాటం స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. "ప్రజల కోసం.. ప్రజలతో కలిసి" అనే స్ఫూర్తితో అల్లూరి సాగించిన ఉద్యమం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోందని భట్టి పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం, అసమానతలను ఎదుర్కొంటూ ప్రజల హక్కుల కోసం పోరాడాలనే స్ఫూర్తిని అల్లూరి జీవితం అందిస్తోందన్నారు. అల్లూరి సీతారామరాజు కేవలం ఒక వ్యక్తి కాదని, స్వేచ్ఛను కోరుకునే ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత శక్తి అన్నారు. దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలకు అల్లూరి ప్రతీకగా నిలిచారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అల్లూరి జయంతి సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు భట్టి విక్రమార్క అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సత్వర వైద్యసేవలు అందించడంతో పాటు పోలీసుల విధుల నిర్వహణలో ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
- ●Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? - నయనతారను బీట్ చేసిందిగా!
- ●Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!
- ●Chandrima Bhattacharya Resigns | మమతా బెనర్జీకి భారీ షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌కి బెంగాల్ చీఫ్ రాజీనామా : రెబెల్స్‌తో భేటీ!
- ●Airtel | రూ.349 ప్లాన్‌కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..
- ●PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!

Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? - నయనతారను బీట్ చేసిందిగా!

Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!

Chandrima Bhattacharya Resigns | మమతా బెనర్జీకి భారీ షాక్.. తృణమూల్ కాంగ్రెస్‌కి బెంగాల్ చీఫ్ రాజీనామా : రెబెల్స్‌తో భేటీ!





