Lee Tarlamis nd Sridhar babu | తెలంగాణతో కలిసి పని చేయడం మాకిష్టమే
Lee Tarlamis nd Sridhar babu | తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని విక్టోరియా (ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ పేర్కొన్నారు. ఏయే అంశాల్లో కలిసి పని చేసేందుకు అవకాశాలున్నాయో చూసి ఆ దిశగా సమగ్ర రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు.
- మంత్రి శ్రీధర్ బాబుతో భేటీలో విక్టోరియా విప్ లీ టార్లామిస్ వెల్లడి
Lee Tarlamis nd Sridhar babu | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని విక్టోరియా (ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ పేర్కొన్నారు. ఏయే అంశాల్లో కలిసి పని చేసేందుకు అవకాశాలున్నాయో చూసి ఆ దిశగా సమగ్ర రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని చెప్పారు. డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా ‘తెలంగాణ-విక్టోరియా’ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారంపై చర్చించినట్లు తెలిపారు.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణ..
ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్, విద్య, నైపుణ్యాభివృద్ధి, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ‘గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
పెట్టుబడులు పెట్టేలా చూడండి..
శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎకో సిస్టంను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ఈ భేటీకి సీఎస్ సంజయ్ జాజు హాజరయ్యారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Airtel | రూ.349 ప్లాన్‌కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..
- ●PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
- ●EPFO | యూఏఎన్ సేవల్లో భారీ మార్పు.. ఇక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కాదు, ఉమాంగ్ యాప్‌లోనే..
- ●Rashmika Mandanna | నేషనల్ క్రష్ డబుల్ ధమాకా - నెల గ్యాప్‌లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్
- ●PFA | పల్స్ ఫీల్డ్ అబ్లేషన్‌తో గుండె దడకు చెక్.. 31, 84 ఏండ్ల బాధిత వ్యక్తులకు చికిత్స విజయవంతం
- ●Alluri Birth Anniversary | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Airtel | రూ.349 ప్లాన్‌కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ

EPFO | యూఏఎన్ సేవల్లో భారీ మార్పు.. ఇక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కాదు, ఉమాంగ్ యాప్‌లోనే..

Rashmika Mandanna | నేషనల్ క్రష్ డబుల్ ధమాకా - నెల గ్యాప్‌లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్





