Devi Prasad | అప్పుల ఊబిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. జీతాలు ఇవ్వరా..? : దేవీ ప్రసాద్
Devi Prasad | రాష్ట్రంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల్లేక అప్పుల ఊబిలో కూరుకుపోయారని బేవేరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన నిప్పులు చెరిగారు.
Devi Prasad | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల్లేక అప్పుల ఊబిలో కూరుకుపోయారని బేవేరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆయన నిప్పులు చెరిగారు. ఉద్యోగులకు కావాల్సింది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం కావాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా, బాధ్యతారహితంగా మారింది. ముఖ్యమంత్రి ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయా? లేక అధికార యంత్రాంగంపై ప్రభుత్వానికి నియంత్రణ లేదా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
కుటుంబాలను పోషించలేని పరిస్థితికి
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు లేక కుటుంబాలను పోషించలేని పరిస్థితికి చేరుకున్నారు. ఒక ఉద్యోగి తన పిల్లల ఫీజులు చెల్లించలేకపోతున్నాడు, మరొకరు ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నారు, ఇంకొంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రకటనలు, ప్రచారాలకే పరిమితమైందనే భావన ప్రజల్లో బలపడుతోందని పేర్కొన్నారు.
ఉద్యోగులకు జీతాలు ఎందుకు అందడం లేదు?
తెలంగాణ మోడల్ స్కూళ్లలో 7 నెలలు, నిలోఫర్ ఆసుపత్రిలో 9 నెలలు పంచాయతీరాజ్ శాఖలో 3 నెలలు, వరంగల్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో 4 నెలలు, గ్రౌండ్ వాటర్, మున్సిపాలిటీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పోలీస్ శాఖలు సహా అనేక విభాగాల్లో ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ ఉందంటున్నారు, నిధులు విడుదల చేశామంటున్నారు, అయితే ఉద్యోగులకు జీతాలు ఎందుకు అందడం లేదు? అని దేవీ ప్రసాద్ నిలదీశారు.
ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ, ఈపీఎఫ్ మొత్తాలు మినహాయించి వాటిని సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా కొంతమంది ఏజెన్సీలు మోసం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల భవిష్యత్ భద్రతతో చెలగాటం ఆడుతున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం కాదు, వాటిని అమలు చేయాలి. ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకోవాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కేవలం చౌకబారు కార్మికులుగా చూడడం మానుకోవాలి అని ఆయన హెచ్చరించారు.
డిమాండ్లు ఇవే..
- పెండింగ్‌లో ఉన్న అన్ని జీతాలను వెంటనే విడుదల చేయాలి.
- ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లింపులు చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్ చేయాలి.
- ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసే విధానం తీసుకురావాలి.
- అన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై ప్రత్యేక విచారణ జరపాలి.
సంబంధిత వార్తలు

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
జులై 13, 2026

Shyam Prasad Reddy | “జైలుకు పంపుతారా? ఆరోజు కేసీఆర్ కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు!”.. రేవంత్ వ్యాఖ్యలపై కన్నీరుపెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్
జులై 12, 2026

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
జులై 12, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



