త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Congress BC CM | బీసీ సీఎం హామీ ఓ డ్రామా: రేవంత్ రెడ్డి 2034 దాకా ఉంటానంటే కుర్చీ ఎలా ఇస్తారు?

కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీఆర్ఎస్ విరుచుకుపడింది. సీఎం పదవి, ఆస్తుల వ్యవహారాలపై తెలంగాణ భవన్‌లో నేతలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

J

Hyderabad | Published On Oct 5, 2026, 3.47 pm IST

Telangana Congress BC CM | బీసీ సీఎం హామీ ఓ డ్రామా: రేవంత్ రెడ్డి 2034 దాకా ఉంటానంటే కుర్చీ ఎలా ఇస్తారు?

సంక్షిప్త సారాంశం

సీఎం రేవంత్ రెడ్డి 2034 దాకా తానే సీఎంగా ఉంటానని చెప్పినప్పుడు, బీసీ సీఎం ఎలా వస్తారని మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ప్రశ్నించారు. చేవెళ్ల బీసీ డిక్లరేషన్‌‌లోని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు గాలికొదిలేసిందని విమర్శించారు. కేబినెట్, కార్పొరేషన్ పోస్టులు, రాజ్యసభ సీట్లలో బీసీలకు తగిన వాటా దక్కలేదని గణాంకాలతో నిలదీశారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రెండూ బీసీలకు నమ్మకద్రోహం చేశాయని ఆరోపించారు.

Advertisement
  • రేవంత్ ఉండగా బీసీ సీఎం ఎలా?
  • కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఫైర్

Telangana Congress BC CM | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో రాబోయే రోజుల్లో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్‌‌పై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, పార్టీ నేత మంచర్ల శ్రీనివాస్ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.

ఇదీ చదవండి : ట్వీట్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు సార్‌.. సీఎం రేవంత్ అక్ర‌మ సంపాద‌న‌పై విచార‌ణ జ‌రిపించండి.. మ‌న్నె క్రిషాంక్‌

రేవంత్ కుర్చీ దిగనంటే బీసీ సీఎం ఎలా వస్తారు?

"2034 వరకు తానే రాష్ట్రానికి సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ఇప్పటికే పదే పదే బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాంటప్పుడు కొత్తగా బీసీ వ్యక్తి సీఎం అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది" అని దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కేవలం బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి డైలాగులు వాడుతున్నారని మండిపడ్డారు.

BRS Slams Congress on BC CM Promise Sharp Attack on Revanth Reddy

బీసీ సీఎం రావాలంటే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు బీసీ వర్గానికి చెందినవారై ఉండాలని, కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులోనే బీసీలకు తీరని అన్యాయం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కేవలం ఇద్దరే బీసీలు ఉన్నారని, ప్రస్తుతం 15 మంది మంత్రులున్న కేబినెట్‌లోనూ ఇద్దరికే చోటు దక్కిందని గుర్తు చేశారు. ఇటీవల ఖరారైన ఇద్దరు రాజ్యసభ ఎంపీ స్థానాలను కూడా ఓసీ వర్గాలకే కట్టబెట్టారని ధ్వజమెత్తారు.

Also Read : ఓయూకు ప్ర‌క‌టించిన‌ 1000 కోట్లు వెంట‌నే ఇవ్వాలి

చేవెళ్ల బీసీ డిక్లరేషన్‌కు దిక్కేది?

చేవెళ్ల బీసీ డిక్లరేషన్ ప్రకటించి 36 నెలలు గడిచినా అందులోని ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని బాలరాజ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 200 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉంటే, బీసీలకు కేటాయించింది కేవలం 41 మాత్రమే.

డిక్లరేషన్ విడుదల చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా పక్కన పెట్టిందో అందరికీ తెలుసు.

ఇదీ చదవండి : మేడిప‌ల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌

రేవంత్ క్యాబినెట్‌లో ఉన్న పద్మశాలి నేతకు మంత్రి పదవి తొలగించి, ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తామనడం వారి డబుల్ స్టాండర్డ్స్‌కు నిదర్శనం.

ప్రభుత్వ పాఠశాలల్లో పిచ్చిగడ్డి కొట్టేందుకు హెడ్ మాస్టర్లు స్వయంగా స్ప్రే చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని, విద్యా శాఖ నిధుల్లేక సతమతమవుతుంటే మంత్రులు మాత్రం చిన్న చిన్న కిచెన్ల ప్రారంభోత్సవాలకే హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు రెండూ బీసీ ద్రోహులే: శుభప్రద్ పటేల్

బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. చరిత్ర పొడవునా బీసీలకు నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కే ఉందని పేర్కొన్నారు. మండల్ కమిషన్ సిఫార్సులను ఏళ్ల తరబడి తొక్కిపెట్టిన నెహ్రూ, ఇందిరా గాంధీ హయాం నుంచే ఈ వివక్ష కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు రావాల్సిన 42 శాతం వాటాను ఇప్పటివరకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : సీఎం రేవంత్, నటి సురేఖావాణిలపై అసభ్యకర పోస్టింగ్.. x అకౌంట్‌పై కేసు నమోదు

"మహేష్ గౌడ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే కాంగ్రెస్ హైకమాండ్‌తో మాట్లాడి తనను తాను సీఎంగా ప్రకటించుకోవచ్చు, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు" అని సవాల్ విసిరారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చకుండా, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. కేవలం ఎన్నికల స్టంట్‌గా బీసీలను వాడుకోవాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని నాయకులు హెచ్చరించారు.

Advertisement
Advertisement