Thunga Balu | ఓయూకు ప్రకటించిన 1000 కోట్లు వెంటనే ఇవ్వాలి
Thunga Balu | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)కి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు.
- రూ.12 వేల కోట్ల ఫీజు బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగాల నోటీఫికేషన్లు విడుదల చేయాలి
- ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్
Thunga Balu | త్రినేత్ర న్యూస్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)కి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు బకాయిలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను సైతం విడుదల చేయాలన్నారు. 1000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్వీ నిరసన ర్యాలీ పోస్టర్‌ను నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈనెల 29న నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడారు.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అన్ని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ, నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని చెప్పిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు.
నిరుద్యోగులను నిరాశకు గురి చేస్తున్నరు
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, పోలీస్, వైద్యారోగ్య శాఖ తదితర నియామకాలను వేగవంతం చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. ఉద్యోగ నియామకాల్లో తీవ్ర జాప్యం, పరీక్షల నిర్వహణలో స్పష్టత లేకపోవడం, తరచూ షెడ్యూళ్లలో మార్పులు, ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోంది అని తుంగ బాలు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొంపల్లి నరేశ్, చాప భాస్కర్, కొమ్మనబోయిన సైదులు యాదవ్, అద్వైత్, వల్లమల్ల సూర్యప్రకాశ్, కొండ గణేశ్, ప్రసన్న కుమార్, సురేశ్, రవికిరణ్, నిరంజన్, ప్రభాకర్, నితీశ్ కుమార్, మహేష్, పరశురాం, సాయి కిరణ్, శాంతి కుమార్, రమేశ్, శివ ప్రసాద్, కరుణాకర్, ముకేశ్, వినయ్, సాయి, నవీన్, మహేష్, సాయి చరణ్, శౌర్య మనోజ్, మహేందర్, మహిపాల్, కుమార్, శ్రీశైలం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అక్టోబర్ 5, 2026

Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అక్టోబర్ 5, 2026

Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ●Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది
- ●Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా
- ●Dasoju Sravan | విద్యకు పార్ట్‌టైమ్ డ్యూటీ సరిపోదు.. విద్యాశాఖ మంత్రిని పెట్టండి
- ●Aadarsha Kutumbam Postpone | వెంకటేష్ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అక్టోబర్ రేసు నుంచి ఔట్?

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది

Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా



