Objectionable posts targeting CM Revanth and actress Surekha Vani | సీఎం రేవంత్, నటి సురేఖావాణిలపై అసభ్యకర పోస్టింగ్.. x అకౌంట్‌పై కేసు నమోదు
Objectionable posts targeting CM Revanth and actress Surekha Vani | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగు సినీ నటి సురేఖావాణి చిత్రాలను మార్ఫింగ్ చేసి, అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ చేసిన వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Objectionable posts targeting CM Revanth and actress Surekha Vani | త్రినేత్ర న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగు సినీ నటి సురేఖావాణి చిత్రాలను మార్ఫింగ్ చేసి, అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ చేసిన వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది కైలాశ్ సజ్జన్ ఫిర్యాదు మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ X (ట్విట్టర్) హ్యాండిల్‌పై ఆదివారం కేసు నమోదు చేశారు.
సదరు X హ్యాండిల్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించి, అతనిపై చర్యలు తీసుకోవాలని కైలాశ్ సజ్జన్ కోరారు. అలాగే వివాదాస్పద పోస్టును తొలగించేలా X Corpకు నోటీసులు జారీ చేయాలన్నారు. BNSS సెక్షన్ 94 ప్రకారం సంబంధిత IP లాగ్‌లను భద్రపరచాలని పోలీసులను కోరారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠకు, మహిళా నటి గౌరవానికి భంగం కలిగించేలా, ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషాన్ని రగిలించేలా ఆ పోస్టింగ్ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈమేరకు పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్లు 67, 67A, బీఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 79, 336(4)తో పాటు 3(5), మహిళల అసభ్యకర ప్రాతినిధ్య (నిషేధ) చట్టం, 1986లోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నల్ల దిలీప్ కుమార్ తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?

Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్





