త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cantonment Land Scam | కంటోన్మెంట్‌లో రూ.800 కోట్ల ల్యాండ్ స్కామ్.. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు

కంటోన్మెంట్ పరిధిలో రూ.800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందంటూ బీఆర్ఎస్ ఎమ్మార్వో ఆఫీసును ముట్టడించింది. ఆ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసింది!

J

Hyderabad | Published On Jun 20, 2026, 4.00 pm IST

Cantonment Land Scam | కంటోన్మెంట్‌లో రూ.800 కోట్ల ల్యాండ్ స్కామ్.. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు
Advertisement

Cantonment Land Scam | త్రినేత్ర.న్యూస్ : కంటోన్మెంట్ పరిధిలో ఓ భారీ ల్యాండ్ స్కామ్ (Land Scam) వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. బోయిన్‌పల్లి సర్వే నెం.157/1లో ఉన్న సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ (BRS) నాయకులు గురువారం ఎమ్మార్వో (MRO) ఆఫీస్‌ను ముట్టడించారు. ఆ స్థలంలో పేదల కోసం 6 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మెంబర్‌షిప్ ఇన్‌చార్జ్ డాక్టర్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. దశాబ్దాలుగా రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉన్న ఆ 8 ఎకరాల ల్యాండ్‌ను.. ఇప్పుడు కబ్జాకోరులకు అప్పజెప్పే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇదే స్థలంలో గతంలో 6,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు సైలెంట్ అవ్వడం వెనుక పెద్ద స్కెచ్ ఉందన్నారు. ఈ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏకంగా రూ.5 కోట్లు ముట్టాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఎఫ్ఐఆర్.. ఇప్పుడు రాసిచ్చేస్తారా?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 19న కబ్జాదారులు ఈ భూమిలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. అప్పటి ఎమ్మార్వో ద్వారా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయించి మరీ ఆ ల్యాండ్‌ను కాపాడామని డా. క్రిశాంక్ గుర్తుచేశారు. కానీ, 2026లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వ భూమిని కబ్జాదారులకు రాసిచ్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని కబ్జాదారుల చేతుల్లో పెడుతోందని విమర్శించారు.

BRS Protest in Secunderabad Rs 800 Cr Land Scam & MLA Bribe Allegations

షాపింగ్ మాల్స్ కోసం కాదు.. పేదల ఇళ్ల కోసం

రూ.800 కోట్ల విలువైన ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తుల షాపింగ్ మాల్స్ (Shopping Malls) కోసం కాకుండా, పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఉపయోగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు చట్టపరంగా ఫైట్ చేసి ఆ స్థలాన్ని కాపాడాలని.. లేదంటే పబ్లిక్ మూవ్‌మెంట్‌ను (Public Movement) మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ముట్టడి కార్యక్రమంలో డా. మన్నె క్రిశాంక్‌తో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, మాజీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, నివేదిత, అనిత, నళిని, కిరణ్, పాండు యాదవ్, శ్యామ్ కుమార్, టి.ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement