Manne Krishank | రాష్ట్రంల హిట్లర్ ప్రభుత్వం నడుస్తోంది
Manne Krishank | రేవంత్ రెడ్డి హిట్లర్‌తో పోల్చుకుంటే దానిపై పోస్ట్ చేస్తే నాపై కేసు పెట్టారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. భవిష్యత్‌లో తెలంగాణలో హిట్లర్ విగ్రహాలు పెడతారేమో అని ఎద్దేవా చేశారు.
- తెలంగాణలో భవిష్యత్‌ల హిట్లర్ విగ్రాహాలు పెడతరేమో
- రేవంత్ హిట్లర్‌తో పోల్చుకోవడం సిగ్గుచేటు
- దానిపై పోస్టు చేస్తే నాపై కేసు పెట్టారు
- హైడ్రాతో పేదల ఇండ్లు కూల్చినమని సీఎం స్పష్టత ఇచ్చిండు
- మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ ధ్వజం
Manne Krishank | త్రినేత్ర.న్యూస్: రేవంత్ రెడ్డి హిట్లర్‌తో పోల్చుకుంటే దానిపై పోస్ట్ చేస్తే నాపై కేసు పెట్టారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. బరాబర్ నేను ఆ పోస్టును తొలగించనని తేల్చి చెప్పారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హిట్లర్‌తో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో హిట్లర్ విగ్రహాలు పెడతారేమో అని ఎద్దేవా చేశారు.
హిట్లర్‌కు ఇష్టమైన పదం హైడ్రానట..
రేవంత్ రెడ్డి దేశాన్ని, రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. సైబర్ క్రైమ్‌ను సైబర్ డ్యామేజ్ కంట్రోల్ బ్యూరోలా నడుపుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి హిట్లర్ ప్రభుత్వం నడుస్తోంది. కేసు పెట్టిన సమాచారం మాకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ హైడ్రాను హిట్లర్‌కు ఇష్టమైన పదం అని అన్నారు. నాజీ నాయకుడు ఆడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేశానని చెప్పారు. హైడ్రా ద్వారా పేద ప్రజల ఇళ్లు కూల్చామని స్పష్టత ఇచ్చారు అని క్రిశాంక్ పేర్కొన్నారు.
అలా పోల్చుకోవడం సిగ్గుచేటు..
హిట్లర్ పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం భయపడుతుంది. రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలని కేసీఆర్ సెక్రటేరియట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టారు. రేవంత్ రెడ్డి హిట్లర్‌తో పోల్చుకుంటే దాని గురించి పోస్ట్ చేస్తేనా పైన కేసు పెట్టారు. కేసు పెట్టిన సమాచారం మాకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హిట్లర్‌తో పోల్చుకోవడం సిగ్గుచేటు.
కంటోన్మెంట్ ఎన్నికలు వెంటనే పెట్టాలి...
ఎ టూ జెడ్ రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెట్టాం. బీజేపీలో సొంత పార్టీ ఎంపీపై వాళ్ల పార్టీ ఎంపీ అనుచరుడు పోస్టర్లు వేసుకున్నారు. కంటోన్మెంట్ ఏం పాపం చేసిందో ఈటెల రాజేందర్ చెప్పాలి. కంటోన్మెంట్ ఎన్నికలు జరగకుండా ముగ్గురు నామినేటెడ్ సభ్యులను నియమించారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వెంటనే పెట్టాలి. అప్పటివరకు హిట్లర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అని మన్నే క్రిశాంక్ హెచ్చరించారు.
హిట్లర్ స్ఫూర్తి అని ఏ రాజకీయ నేత చెప్పలేదు: పాటి మీద జగన్మోహన్ రావు
హిట్లర్ ప్రపంచ నియంత. హిట్లర్‌కు తన దేశంలో ఉన్న ప్రజలను చంపిన చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. హిట్లర్ వారసుడిని నేనే అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు. తీవ్రవాద చట్టాలను సామాన్య ప్రజలపై ప్రయోగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు మాత్రమే వస్తాయి.
కాంగ్రెస్ గాంధీ సిద్ధాంతమంటే రేవంత్ హిట్లర్ సిద్ధాంతం అంటుండు: దినేష్ చౌదరి
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ గాంధీ, నెహ్రు సిద్ధాంతం అంటుంది. రేవంత్ రెడ్డి హిట్లర్ సిద్దాంతం అంటున్నారు. ఫాసిస్టు ధోరణి కలిగిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్నారా? సినిమాలో పాత్ర చూసి హైడ్రా గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కూల్చివేతలను రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆయనకు మానవత్వం లేదు. కాంగ్రెస్ ఎవరిని ప్రోత్సహిస్తుందో జెన్ జీ గమనించాలి.
రేవంత్‌ను బర్తరఫ్ చేయాలి: పుట్టా విష్ణు వర్ధన్ రెడ్డి
రేవంత్ రెడ్డి విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలపై రేవంత్ రెడ్డిని రుద్దారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి.
ఆయనతో క్షమాపణలు చెప్పించాలి.
సంబంధిత వార్తలు

Pinarayi Vijayan | ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్
జూన్ 8, 2026

Tenant Farmers Survey | రేపు కౌలు రైతుల సర్వే రిపోర్ట్ వెల్లడిస్తాం: కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ
జూన్ 8, 2026

TGSPDCL Electricity Bill Calculation | మీ కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసా? ఏం చార్జీలు వేస్తారో తెలుసా?
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Child Obesity | చిన్నారుల్లో అధికమవుతున్న ఊబకాయం సమస్య.. ఫోన్లే కారణమా..?
- ●Pinarayi Vijayan | ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్
- ●Speeding Truck | హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రక్కు, కారు.. Viral Video
- ●Kotak Mahindra Life | కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ గుడ్ న్యూస్.. పార్టిసిపేటింగ్ పాలసీదారులకు భారీ బోనస్..
- ●Indian Embassy in Tehran | వెంటనే ఇరాన్‌ను వీడండి.. పౌరులకు భారత్ కీలక అడ్వైజరీ
- ●Tenant Farmers Survey | రేపు కౌలు రైతుల సర్వే రిపోర్ట్ వెల్లడిస్తాం: కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ

Child Obesity | చిన్నారుల్లో అధికమవుతున్న ఊబకాయం సమస్య.. ఫోన్లే కారణమా..?

Pinarayi Vijayan | ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్

Speeding Truck | హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రక్కు, కారు.. Viral Video

Kotak Mahindra Life | కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ గుడ్ న్యూస్.. పార్టిసిపేటింగ్ పాలసీదారులకు భారీ బోనస్..



