త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ప్రజా పాలన ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాలన : త‌ల‌సాని

Talasani Srinivas Yadav | తాండూరు పట్టణ పరిధిలో స‌మ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు (RTC Strike) టెంట్ సామాన్లు (tent materials) ఇవ్వ‌కూడ‌దంటూ పోలీసులు చేసిన హెచ్చ‌రిక‌ల‌పై బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

D

Hyderabad | Published On Apr 23, 2026, 1.43 pm IST

Talasani Srinivas Yadav | ప్రజా పాలన ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాలన : త‌ల‌సాని
Advertisement

Talasani Srinivas Yadav | తాండూరు పట్టణ పరిధిలో స‌మ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు (RTC Strike) టెంట్ సామాన్లు (tent materials) ఇవ్వ‌కూడ‌దంటూ పోలీసులు చేసిన హెచ్చ‌రిక‌ల‌పై బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఈ మేర‌కు రేవంత్ స‌ర్కార్‌పై ఫైర్ అయ్యారు. ప్ర‌జా పాల‌న ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాల‌న చేస్తోంద‌ని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ తాండూరు ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఆర్టీసీ కార్మికుల‌కు టెంట్ సామాన్లు ఇవ్వ‌రాదు అని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ నోటీసులు ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కూ క‌రెక్ట్‌ అని ప్ర‌శ్నించారు. దీనిపై రాష్ట్ర డీజీపీ స‌మాధానం చెప్పాల‌ని త‌ల‌సాని డిమాండ్ చేశారు. మీలాగా వారు ప్ర‌భుత్వ ఉద్యోగులు కాదా..? అంటూ ప్ర‌శ్నించారు. పోలీసుల‌ను పెట్టి దేనినైనా అణ‌చివేయొచ్చ‌ని అనుకుంటున్నారా..? అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

టెంట్ హౌస్‌, ఫంక్ష‌న్ హాల్ ఓన‌ర్ల‌కు పోలీసుల హెచ్చ‌రిక..

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె (RTC Strike) రెండో రోజూ కొన‌సాగుతున్న‌ది. బ‌స్సులు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా బ‌స్టాండ్ల‌లో ఆర్టీసీ కార్మికులు (TGS RTC) అడ్డుకుంటున్నారు. దీంతో డిపోలు, బ‌స్టాండ్ల‌లో పెద్ద సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. కాగా, తాండూరు పోలీసులు (Tandur Police) ఒక అడుగు ముందుకు వేశారు. టెంట్ హౌస్, ఫంక్ష‌న్ హాళ్లు, క‌మ్మూనిటీ, క‌న్వెన్ష‌న్ హాల్ ఓన‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

చ‌ట్ట విరుద్ధంగా, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆర్టీసీ కార్మికుల స‌మ్మె సాగుతున్న‌ద‌ని, స‌మ్మెకు ఎలాంటి అనుమ‌తి లేద‌ని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సామాన్లు, టెంట్లు, హాళ్ల‌ను కిరాయికి ఇస్తే స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లేన‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు తాండూరు పోలీసులు టెంటు హౌస్‌, ఫంక్ష‌న్ హాల్ నిర్వాహ‌కుల‌కు నోటీసులు జారీచేశారు. దీనిపై త‌ల‌సాని తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

Also Read..

నాటి విమ‌ర్శ‌కుడే.. నేడు ఆప్తుడ‌య్యాడు.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే సంజ‌య్ వ్యాఖ్య‌లు

చెదిరిన డాల‌ర్ క‌ల‌.. అమెరికాను వీడేందుకు సిద్ధ‌మైన 40 శాతం మంది భార‌తీయులు

తెరుచుకున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు.. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Advertisement
Advertisement