త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sanjay Kumar | నాటి విమ‌ర్శ‌కుడే.. నేడు ఆప్తుడ‌య్యాడు.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే సంజ‌య్ విమ‌ర్శ‌లు

MLA Sanjay Kumar | గ‌తంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను (BRS) అత్య‌ధిక‌సార్లు విమ‌ర్శించిన జీవ‌న్‌రెడ్డి, నేడు వారికి అత్యంత ఆప్తుడ‌య్యాడ‌ని జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ (MLA Sanjay Kumar) విమ‌ర్శించారు. కేటీఆర్‌ను (KTR) లోఫ‌ర్ అన్నందుకు జీవ‌న్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా అని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Apr 23, 2026, 1.36 pm IST

MLA Sanjay Kumar | నాటి విమ‌ర్శ‌కుడే.. నేడు ఆప్తుడ‌య్యాడు.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే సంజ‌య్ విమ‌ర్శ‌లు
Advertisement

MLA Sanjay Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌తంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను (BRS) అత్య‌ధిక‌సార్లు విమ‌ర్శించిన జీవ‌న్‌రెడ్డి, నేడు వారికి అత్యంత ఆప్తుడ‌య్యాడ‌ని జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ (MLA Sanjay Kumar) విమ‌ర్శించారు. బ‌తుక‌మ్మ మీద లిక్క‌ర్ పెట్టి ఆడుతుంద‌ని క‌విత‌ను జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) విమ‌ర్శించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. కేటీఆర్‌ను (KTR) లోఫ‌ర్ అన్నందుకు జీవ‌న్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా అని మండిప‌డ్డారు. మాజీ జెడ్పీ చైర్మన్ తండ్రిపై 2011లో రౌడీ షీట్ ఓపెన్ చేసింది నిజం కాదా? అని ప్ర‌శ్నించారు. నా చొరవతో షీట్ తీయించింది వాస్తవం కాదా? అని నిల‌దీశారు. గోపాలరావుపేట్ పాఠశాలలో చెట్లు కొడితే విజిలెన్స్ విచార‌ణ‌ పెట్టింది నిజం కాదా అన్నారు. ఎల్ రమణపై లిక్కర్, ధన ప్రవాహం తదితర అంశాల్లో వారి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు పెట్టించార‌ని గుర్తుచేశారు. వాణినగర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు కూర్చునే కుర్చీలు తీసి డంపింగ్ యార్డుకు తరలించార‌న్నారు.

క్రాస్ బ్రీడ్ మీరే..

త‌న‌ది మొదటి నుంచి రాజకీయ కుటుంబ‌మ‌ని సంజ‌య్ అన్నారు. అక్రమ సంపాదన అహంకారంతో కేటీఆర్‌ మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. 2014లో జగిత్యాలలో గెలిచే అభ్యర్తి లేకుంటే త‌న‌ను పిలిచి టికెట్ ఇచ్చార‌ని చెప్పారు. రాజకీయాలలోకి వచ్చాకా త‌న‌వి, త‌న‌ కుటుంబ సభ్యుల‌ ఆస్తులు తగ్గాయే తప్ప పెరగలేద‌న్నారు. ఈ విష‌యంలో ఎలాంటి విచారణ అయినా సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్‌ను నిలబెట్టి జీవన్ రెడ్డికి క్రాస్ ఓటు వేయించిన మీరు క్రాస్ బ్రీడ్ నాయకులంటూ కేటీఆర్‌పై మండిప‌డ్డారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన జీవన్ రెడ్డి.. గ‌త‌ ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కు అయి అరవింద్‌కు ఓట్లు వేయించార‌ని ఆరోపించారు.

అప్పుడు ఎందుకు ప్రోత్సహించారు..

జగిత్యాల అభివ్రుద్ది కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఈ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూం ఇండ్లు, మెడికల్ కళాశాల, రోళ్ల‌ వాగుకు నిధులు మంజూరు చేయించాన‌ని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అధిక మెజార్టీ స్థానాలు ఉన్న‌ప్ప‌టికీ చేరిక‌ల‌ను ఎందుకు ప్రోత్సహించార‌ని ప్ర‌శ్నించారు. 2009 నుంచి జగిత్యాల పట్టణం చుట్టుపక్కల జీవన్ రెడ్డికి ఎప్పుడూ మెజార్టీ రాలేద‌న్నారు. చొక్కారావు, శ్రీరంగ రావుల రాజకీయ వారసత్వం త‌న‌ద‌ని చెప్పారు.

Advertisement
Advertisement